బేగంపేట పీఎస్ పరిధిలో కత్తిపోట్ల కలకలం

man was attacked with a knife by a gang in begumpet

హైదరాబాద్ నగరం బేగంపేట పీఎస్‌ పరిధిలోని ఆదివారం తెల్లవారు జామున కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించిది. ఇలాహి మజీద్‌ వద్ద నడుచుకుంటూ వెళ్లున్న ప్రదీప్‌ అనే వ్యక్తిపై మునీర్‌తో పాటు అతని స్నేహితులు కత్తితో దాడికి దిగారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ప్రదీప్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా.. చిలుకలగూడలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. డబ్బు విషయమై నవాజ్‌, సంతోష్‌ అనే యువకుల మధ్య వివాదం తలెత్తింది. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని సంతోష్‌ను నవాజ్‌ అడగ్గా.. డబ్బులు ఇచ్చేది లేదని చెప్పడంతో కత్తితో నవాజ్‌ దాడికి పాల్పడ్డాడు. సంతోష్‌కు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. నవాజ్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.