ప్రియాంక పెళ్ళి దెగ్గరుండీ చేస్తా.. ఒప్పేసుకున్న మానస్ తల్లి..!

Manas Mother About Priyanka Singh Marriage
Manas Mother About Priyanka Singh Marriage
Manas Mother About Priyanka Singh Marriage
Manas Mother About Priyanka Singh Marriage

బిగ్ బాస్ హౌస్ లో లవ్ బర్డ్స్ కి క్రేజ్ ఎక్కువ. సోషల్ మీడియా ఫోకస్ మొత్తం అలాంటి అఫైర్స్ పైనే ఉంటుంది. అందుకే హౌస్ లో ఎంట్రీ ఇవ్వగానే ఇంటిసభ్యులు ఎవర్నైనా ఒకర్ని సెట్ చేసుకుంటారు. ప్రేక్షకుల దృష్టంతా తమపైనే ఉండేలా ప్లాన్స్ వేస్తారు. అలా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వగానే మానస్ పై మనసు పడేసుకుంది ప్రియాంక. దేవుడు నాకు మంచి లైఫ్‌ ఇచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు నీతో హ్యాపీగా ఉండేదాన్ని’ అంటూ అర్ధరాత్రి తన బాధను మానస్‌తో చెప్పుకుంటూ బాధపడింది ప్రియాంక సింగ్‌. రోజురోజుకీ అతడి మీద ప్రేమను పెంచుకుంటూ, అతడి గురించే ఆలోచిస్తూ కాలం గడిపేస్తోంది పింకీ. దీంతో ఆమె పరిస్థితి చూసి నెటిజన్స్ ఆందోళన చెందుతున్నారు. బిగ్ బాస్ అయిపోయాక మానస్ తనతో ఉండడన్న విషయం గుర్తుపెట్టొకోవాలని అంటున్నారు. దీంతో వీరిద్దరి ప్రేమ పెళ్లి వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. దేనేలంపై తాజాగా మానస్ తల్లి స్పందించింది. ప్రియాంక అంటే తనకెంతో ఇష్టమని..కానీ తన కొడుకుతో వివాహానికి మాత్రం ఒప్పుకొనని చెప్పింది మానస్ తల్లి.

ఒక ఇంటర్వ్యూ లో మానస్ తల్లి పద్మిని మాట్లాడుతూ.. ఆమె చాలా మంచి అమ్మాయి, నాకెంతో ఇష్టం. ఓసారి ప్రియాంక.. మానస్‌ను హజ్బెండ్‌ మెటీరియల్‌ అంది. కానీ, మానస్‌ ఆమె కేవలం మరదలని చెప్పాడు. బిగ్‌బాస్‌ అనేది 110 రోజుల ఆట. ఆ షో అయిపోగానే ఎవరైనా పెళ్లిళ్లు చేసుకున్నారా.. అలాంటిదేమి ఉండదు. జస్ట్ అక్కడ ఫ్రెండ్లిగా మాట్లాడుకుంటారు. హౌస్‌లో మానస్‌కు ఎవరూ సెట్‌ కారు. నేను ఎవర్ని వేలు పెట్టి చూపిస్తే మానస్‌ ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. ప్రియాంక సింగ్‌.. నా కొడుకును పెళ్లి చేసుకుంటానంటే మాత్రం ఒప్పుకోను. ఆమెను తగిన అబ్బాయిని చూపించి పెళ్లి చేస్తా. అలా ప్రియాంకకు నేను సపోర్ట్‌ చేస్తాను, ఏదైనా సాయం చేస్తాను అని చెప్పింది మానస్ తల్లి పద్మిని.