అలయ్ బలయ్ స్టేజ్ వెనుక.. మంచు విష్ణుతో పవన్ కళ్యాణ్ మంతనాలు..మొత్తం బయటపెట్టిన మంచు లక్ష్మి..!

Manchu Lakshmi About Pawan Kalyan Manchu Vishnu Talks Behind The Alai Balai Stage

బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది దసరా తరువాత ఏర్పాటు చేసే అలయ్ బలయ్ కార్యక్రమంలో నిన్న కొత్త సీన్ ఒకటి దర్శనమిచ్చింది. ఎంత రాజకీయ శత్రుత్వం ఉన్నా.. దసరా పండగ తరువాత ఒకర్నొకరు ఆలింగనం చేసుకుని స్నేహన్నీ, ప్రేమని పంచుకోవటం తెలంగాణ సంస్కృతి. అలాంటి అలయ్ బలయ్ కి హాజరైన సినీ స్టార్స్ పవన్ కళ్యాణ్, మంచు విష్ణులు నిన్న ఒకే స్టేజిపై ఎదురుపడ్డా.. ఎడమొహం పెడమొహం వేసుకుని కూర్చోవటం మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. దీంతో తాజాగా ఈ ఇష్యు పై మంచు లక్ష్మి స్పందించింది.

మోహన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన మా ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు అండ్ ప్యానల్ తో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళింది మంచు లక్ష్మి. అక్కడ పవన్ కళ్యాణ్ విష్ణుల పై స్పందించింది. ‘బండారు దత్తాత్రేయ గారి అలయ్ బలయ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో పాటు విష్ణు కూడా వెళ్ళాడు. అయితే, బయట ప్రచారం జరుగుతున్నట్లు.. పవన్ కళ్యాణ్, విష్ణు ఎడమొహం పెడమొహంగా లేరు. కెమెరా కి వెనుక ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ విషయం తెలియక ఒక ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు’ అంటూ మంచు లక్ష్మి మండి పడ్డారు.. మాలో మాకు విబేధాలు లేవు.. మేమంతా ఒకటే అంటూ మంచి లక్ష్మి చెప్పారు.