ఏంటి తమాషానా.. ఒక ఆటాడుకున్న నెటిజన్స్ పై.. మంచు లక్ష్మి ఆగ్రహం..!

manchu lakshmi serious on netizens
manchu lakshmi serious on netizens
manchu lakshmi serious on netizens
manchu lakshmi serious on netizens

మంచు లక్ష్మి చేసే స్పీచ్, పెట్టె ట్వీట్స్.. ట్రోలర్స్ కి మంచి మెటీరియల్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తుంటాయి. ఆవిడ ఏం మాట్లాడినా ట్రోల్ చేద్దామని.. సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది. మంచు విష్ణు, మోహన్ బాబులతో పాటు మంచు లక్ష్మి మాటలని జతచేసి క్రియేట్ చేసిన మీమ్స్ కి యూ ట్యూబ్ లో లక్షలాది వ్యూస్ వస్తుంటాయి. అయితే ఇలాంటి మీమ్స్ ని సెలబ్రేటిస్ కొంచం సరదగానే తీసుకుంటూ ఉంటారు. మాకు క్రేజ్ ఉంది కాబట్టే యూస్ చేసుకుంటున్నారని లైట్ తీసుకుంటారు. అయితే అదేపనిగా.. టార్గెట్ చేసినట్టు తమపై ట్రోల్స్ దాడి చేస్తున్నారని కొన్నిసార్లు కొందరు సెలబ్రెటీలు హార్ట్ కూడా అవుతుంటారు. తాజాగా మంచు లక్ష్మి కూడా ట్రోలర్స్ పై ఇలాంటి అసహనాన్ని ప్రదర్శించింది. మొన్న మా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తన సోదరుడిని ఉద్దేశించి మంచు లక్ష్మి ‘మా తమ్ముడా మజాకా’ అంటూ ట్వీస్ట్ చేసింది. అయితే ఆ ట్వీట్ ఏమంత వైరల్ అవ్వలేదు. తాజాగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం అయిపోగానే మరో ట్వీట్ కొట్టింది లక్ష్మి. అయితే ఈ ట్వీట్ లో ట్రోలర్స్ కి పుష్కలమైన మెటీరియల్ దొరికింది. దాంతో లక్ష్మిపై మీమ్స్, ట్రోలింగ్ మొదలైపోయింది. వెల్లువలా నెగిటీవ్ కామెంట్స్ వస్తుండటంతో మంచు లక్ష్మి మళ్ళీ రియాక్ట్ అవుతూ ఇకచాలు ఆపండి బాబోయ్ నేను అలా అనలేదు అంటూ ట్రోలర్స్ కి సంజాయిషీ కూడా ఇచ్చేసింది.

‘ఈ రోజు మా కుటుంబానికి అత్యంత శుభదినం. నా సోదరుడు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రపంచాన్ని మార్చడానికి నువ్వు ప్రారంభించనున్న కొత్త ప్రయాణానికి ఆల్‌ ది బెస్ట్‌ అంటూ’ మంచి లక్ష్మి ట్వీట్ చేశారు.దీంతో మా అధ్యక్షడు ప్రపంచాన్ని మార్చడమేంటి అంటూ నెటిజన్స్ ఒక రేంజిలో మంచు లక్ష్మిని ఆడేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి కామెంట్స్ చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ.. ఎదుటివాళ్ల మాటను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఛాన్స్‌ దొరికితే చాలు ఇలా కామెంట్‌ చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది మంచు లక్ష్మి. తాను మళ్ళీ రీ ట్వీట్ చేస్తూ.. ఇకనైనా ఆపండి. ఎప్పుడు ఎవరు కామెంట్స్ చేస్తారు.. ఎలా విమర్శించాలి అని చూస్తుంటారు. ప్రపంచాన్ని మార్చడానికి అంటే మా ప్రపంచం అని అర్ధం. ఎందుకంటే మాకు సినిమానే ఒక ప్రపంచం.. కాబట్టి, నా ఉద్దేశం మీరనుకునే ప్రపంచం కాదు. ‘మా’ అసోసియేషన్ అనే ప్రపంచాన్ని మార్చడం” అని క్లారిటీ ఇచ్చారు మంచు లక్ష్మి. దాంతో ‘వాటే కవరింగ్ మేడం..’ అంటూ నెటిజన్స్ మంచు లక్ష్మిపై కామెంట్స్ చేస్తున్నారు.