వారిలో ఎవ్వడికైనా.. నా అంత సత్తా ఉందా.. తొలిసారి అందరిముందు.. ప్రకాష్ రాజ్ పరువు తీసిన మంచు విష్ణు..!

Manchu Vishnu Announces His Panel For MAA Elections And Satires On Prakash Raj
Manchu Vishnu Announces His Panel For MAA Elections And Satires On Prakash Raj
Manchu Vishnu Announces His Panel For MAA Elections And Satires On Prakash Raj
Manchu Vishnu Announces His Panel For MAA Elections And Satires On Prakash Raj

ఇప్పటివరకు ఏకపక్షంగా సాగిపోతున్న మా ఎన్నికల ప్రమోషన్స్ లో మంచు విష్ణు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్యానల్ ప్రకటన, వరుస ప్రెస్ మీట్స్, ఫైవ్ స్టార్ హోటల్స్ లో మీటింగ్స్ ఇలా దూకుడుగా ముందుకెళ్తున్న ప్రకాష్ రాజ్ కి షాక్ ఇస్తూ నేడు మంచు విష్ణు మీడియా ముందుకొచ్చాడు. అక్టోబర్‌ 10న జరుగనున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల కోసం అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు తన ప్యానల్‌ సభ్యులను పరిచయం చేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో కార్యక్రమం జరిపి.. ‘మా’లో మార్పు తీసుకొస్తానని, ప్రతి ఒక్కరికి మెడికల్‌ ఇన్సురెన్స్‌ కలిపిస్తామని పలు హామీలు ఇస్తూనే.. ప్రకాష్ రాజ్ పై పదునైన విమర్శలు చేశాడు. అవతలి వైపువాళ్ళు మంచి నటులు అంటూనే.. ‘మా’ కి సేవలు అందించే సత్త ఎవరికీ లేదని ప్రకాష్ రాజ్ పై ఇన్ డైరెక్ట్ గా సెటైర్స్ వేశాడు. రెస్టారెంట్స్ లో డిస్కౌంట్స్ ఏంటి అసలు.. అంటూ ప్రకాష్ రాజ్ ఇచ్చిన హామీలను విమర్శిస్తూ పరువు తీసాడు మంచువిష్ణు.

‘మా’ లో ఇప్పటివరకు ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదు. గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం దారుణం. ఈ విషయంపై మా నాన్నగారు కూడా ఎంతో ఆవేదనతో ఉన్నారు. ఎన్నికల తీరుపై ఎవరు సంతోషంగా లేరు. అందుకే నేను ఏకగ్రీవం కోసం చాల ప్రయత్నించా.. కానీ పోటీకి దిగక తప్పటం లేదు. అప్పట్లోనే దాసరి గారు, మురళి మోహన్ గారు కూర్చుని నన్ను ప్రెసిడెంట్‌గా చేయమన్నారు. కానీ నాన్నగారు వద్దు అంటే నేను డ్రాప్ అయిపోయాను. ఇక ప్రస్తుతం తన ప్యానల్‌లో మహిళలకు పెద్ద పీట వేస్తున్న. పెద్దలకు సెక్యూరిటీ ఇవ్వటమే ప్రథమ ప్రాధాన్యం. మా బిల్డింగ్ తన సొంత డబ్బులతో కడతాను. ఇప్పటికే మాట ఇచ్చాను, కానీ అందులో పెళ్లిళ్లు జరగవు. సినిమాలు ఆడవు. షాపింగ్ మాల్స్ కట్టను. కేవలం ఆ బిల్డింగ్ సీనియర్స్ కి ఎలాంటి సహాయం చేస్తుందో మాత్రమే ఆలోచిస్తా.

కానీ కొందరు అవతలి వైపు వారు మాత్రం ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న సమస్యలను పరిష్కరించరించాలంటే ఎనర్జీతో పని చేయాలి. నేను చేస్తాను. అవతలివైపు వారు చేయగలరా.. ఆ ప్యానెల్‌లో ఎంతో మంది గొప్ప నటులున్నారు. నిర్మాతగా నా వద్ద ఎంతో మందిని పెట్టుకున్నాను. కానీ మా అసోసియేషన్‌కు మాత్రం వాళ్లు ఎలాంటి సేవ చేయలేరు. అది నాకు తెలుసు. ఇండస్ట్రీ వాళ్లకు తెలుసు. వారు మాట్లాడిన దాంట్లో 90శాతం తప్పులే. రెస్టారెంట్‌కు వెళ్తే డిస్కౌంట్ ఏంటి? అన్నపూర్ణమ్మ గారు వెళ్తారా? బాబు మోహన్ గారు వెళ్తారా? పెద్దవాళ్లను మనం చూసుకోవడం బాధ్యత? ఇది చారిటా? అంటూ ప్రకాష్ రాజ్ పరువు పోయేలా సెటైర్స్ వేశాడు మంచు విష్ణు.

ఇక మా ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తన ప్యానల్ సభ్యలని పరిచయం చేశాడు మంచు విష్ణు.

‘మా’ కోసం మనమందరం

1. మంచు విష్ణు – అధ్యక్షుడు

2. రఘుబాబు – జనరల్‌ సెక్రటరీ

3. బాబు మోహన్‌ – ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌

4. మాదాల రవి – వైస్‌ ప్రెసిడెంట్‌

5. పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి – వైస్‌ ప్రెసిడెంట్‌

6. శివబాలాజీ – కోశాధికారి

7. కరాటే కల్యాణి -జాయింట్‌ సెక్రటరీ

8. గౌతమ్‌ రాజు-జాయింట్‌ సెక్రటరీ

ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు

9. అర్చన

10. అశోక్‌కుమార్‌

11. గీతాసింగ్‌

12. హరినాథ్‌బాబు

13. జయవాణి

14. మలక్‌పేట్‌ శైలజ

15. మాణిక్‌

16. పూజిత

17. రాజేశ్వరీ రెడ్డి

18. సంపూర్ణేశ్‌ బాబు

19. శశాంక్‌

20. శివన్నారాయణ

21. శ్రీలక్ష్మి

22. శ్రీనివాసులు

23. స్వప్న మాధురి

24. విష్ణు బొప్పన

25. వడ్లపట్ల

26. రేఖ