అల్లు అర్జున్ అంటే నాకు అసూయ.. మనసులో మాట చెప్పేసిన మంచు విష్ణు

manchu vishnu comments about Allu Arjun
manchu vishnu comments about Allu Arjun
manchu vishnu comments about Allu Arjun
manchu vishnu comments about Allu Arjun

మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు.. మెగా హీరో అల్లు అర్జున్ మీద ఆసక్తికర కామెంట్లు చేశాడు. మా ఎన్నికల నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు పలు విషయాలు పంచుకున్నాడు. మెగా కుటుంబంతో మంచి స్నేహ సంబంధాలున్నాయని.. అల్లు అర్జున్ తనకు మంచి స్నేహితుడని.. నిత్యం తామిద్దరం కలుసుకుంటామని చెప్పారు. అయితే.. అల్లు అర్జున్ గురించి చెప్తున్న క్రమంలో మంచు విష్ణు బన్నీ మీద తనకు అసూయగా ఉందని చెప్పాడు. సేమ్ టైమ్ బన్నీని చూస్తుంటే గర్వంగా కూడా ఫీలవుతున్నట్టు చెప్పాడు మంచు విష్ణు. బన్నీ నటిస్తున్న పుష్ప మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుందని.. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చడ్డా కూడా పానిండియా లెవల్లో రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ మీడియా.. అమీర్ ఖాన్ తో పాటు.. అల్లు అర్జున్ గురించి రాస్తాయని.. ఈ విషయం గుర్తొస్తే.. అసూయ కలుగుతోందని చెప్పాడు.

manchu vishnu comments about Allu Arjun
manchu vishnu comments about Allu Arjun

బ్రదర్ నిన్ను చూసి అసూయ పడుతున్నాను. కానీ.. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా కూడా ఉంది అంటూ మెసేజ్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు విష్ణు. డిసెంబర్ 17న రిలీజ్ కానున్న పుష్ప మూవీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నాడు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రెండు భాగాలుగా రానున్న పుష్ప మూవీ భారీ హిట్ కావాలని కోరుకుంటున్నట్టు విష్ణు తెలిపాడు.