నిన్న తండ్రి, నేడు కొడుకు.. పవన్ కళ్యాణ్ కి మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్..!

Maa President Candidate Manchu Vishnu disagrees with Pawan Kalyan Comments On AP Gov
Maa President Candidate Manchu Vishnu disagrees with Pawan Kalyan Comments On AP Gov
Maa President Candidate Manchu Vishnu disagrees with Pawan Kalyan Comments On AP Gov
Maa President Candidate Manchu Vishnu Disagrees With Pawan Kalyan Comments On AP Gov

ఇప్పటివరకు ఏకపక్షంగా సాగిపోతున్న మా ఎన్నికల ప్రమోషన్స్ లో మంచు విష్ణు ఛాలెంజింగ్ ఎంట్రీతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. సినీ మా ఎన్నికలు కాస్త ఇప్పుడు మెగా-మంచు యుద్ధంలా తయారైంది. మోహన్ బాబు వర్సెస్ చిరంజీవిలా సాగుతున్న ఈ మా ఎన్నికల వేడిలో పవన్ కళ్యాణ్ లేటెస్ట్ స్పీచ్ మరింత అగ్గిని రాజేస్తోంది.         ఏపీ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకి అన్యాయం చేస్తుందని.. ముఖ్యమంత్రి జగన్ కి బంధువు అని చెప్పుకునే మోహన్ బాబు దీనిపై స్పందించాలని ఘాటు వ్యాఖ్యలు చేశాడు పవన్ కళ్యాణ్. దీంతో ముక్కుసూటిగా మాట్లాడే మోహన్ బాబు స్పందించాడు. ‘నువ్వు నా కంటే చిన్నవాడివి. చాల రోజుల తరువుత నన్ను మెల్లిగా లాగావ్. మా ఎన్నికలు అయిపోగానే నీకు సమాధానం చెప్తా..నీ ఓటు మాత్రం మీ తమ్ముడు విష్ణు బాబుకే వెయ్యు’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. ఈ క్రమంలో మా అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన మంచు విష్ణు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించాడు.

ఆన్ లైన్లో సినిమా టికెట్లు అమ్మాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై జనసేనాని, సినీ హీరో కూడా అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై సినీ ఇండస్ట్రీ స్పదించాలంటూ పిలుపునిచ్చారు. ఈ విషయంపై మంచు విష్ణుని స్పందించమని అడుగుతే.. పవన్ వ్యాఖ్యలకి నేను ఏకీభవించటం లేదని విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి మా ఫిలిం ఛాంబర్ గట్టి సమాధానం ఇచ్చింది. ప్రభుత్వంతో ఇండస్ట్రీకి మంచి సంబంధాలు ఉండాలని, అనవసరంగా గొడవలు ఉండొద్దని, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని ఛాంబర్ చెప్పిందిగా.. నేను ఛాంబర్ వ్యాఖ్యలనే సమర్థిస్తున్న. తెలుగు ఇండస్ట్రీ బిడ్డగా, నిర్మాతగా, నటుడిగా ఫిలిం ఛాంబర్ ఇచ్చిన లేఖతోనే తాను ఏకీభవిస్తున్నా.. ప్రకాష్ రాజ్ కూడా తన స్పందన తెలియజేయాలి. ఆయన ఎవరి పక్షమో తెలపాలి. ఇండస్ట్రీ పక్షాన ఉంటాడో.. పవన్ పక్కన ఉంటాడో ప్రకాష్ రాజ్ స్పష్టం చేయాలి’ అంటూ మంచు విష్ణు పవన్ కళ్యాణ్ కి ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇస్తూనే.. తెలివిగా ప్రకాష్ రాజ్ ని మధ్యలోకి లాగాడు.