విర్రవీగొద్దు.. దిమ్మతిరుగుతుంది.. విష్ణు ప్రమాణ స్వీకారంలో.. విరుచుకుపడ్డ మోహన్ బాబు..!

Mohan Babu Sensational Comments On Mega Family Heroes
Mohan Babu Sensational Comments On Mega Family Heroes
Mohan Babu Sensational Comments On Mega Family Heroes
Mohan Babu Sensational Comments On Mega Family Heroes

వాదోపవాదాలు.. మాటల తూటాలు.. దూషణలు.. వివాదాల నడుమ మా ఎన్నికలు జరుగగా.. సంచలన విజయం సాధించిన మంచు విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు అట్టహాసంగా జరిగింది. ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో శనివారం నిర్వహించిన ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ప్రత్యర్థి వర్గంపై సంచలన కామెంట్స్ చేశాడు మోహన్ బాబు. మంచు విష్ణుతో పాటు, ప్యానల్ సభ్యులు ప్రమాణ స్వీకారం జరుగగా.. మోహన్ బాబు చేసిన కొన్ని కామెంట్స్ ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త వివాదాలని రేకెత్తించాల ఉంది. మంచు విష్ణు ప్రమాణ స్వీకారం అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘ఇక్కడ నువ్వు గొప్పా.. నేను గొప్పా.. సినిమాలు ఉన్నాయా, లేవా అన్నది కాదు. ఎంత కష్టపడి సినిమా చేసిన ఒక్కోసారి ప్లాప్స్‌ వస్తుంటాయి. అంత మాత్రన కొందరు విర్రవీగుతున్నారు. అలా చేస్తే దేవుడు ఉంటాడు. దిమ్మతిరిగేటట్లు కొడతాడు. అంటూ సంచలన కామెంట్స్ చేశాడు మోహన్ బాబు. అయితే ఈ కామెంట్స్ ఎవ్వరిని ఉద్దేశించి చేశాడో అన్నది అందరికి తెలిసిందే. మెగా హీరోలని ఉద్దేశించే మోహన్ బాబు ఈ కామెంట్స్ చేశాడని సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. ఇక ‘మా’ ఎన్నికల సమయంలో మేము ఇంతమంది ఉన్నాం.. అంతమంది ఉన్నామని కొంతమంది వ్యక్తులు బెదిరించారు. కానీ ఆ బెదిరింపులకు ఎవరూ భయపడలేదు. మా ఓటు మా ఇష్టమని నా బిడ్డను గెలిపించినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. నాకు పగ, రాగద్వేషాలు లేవు. నా తెలివి తేటలతో, క్రమ శిక్షణతో ఇక్కడి వరకు వచ్చాను అంటూ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సంచలన కామెంట్స్ చేశాడు మోహన్ బాబు.