పవన్ కళ్యాణ్ కలెక్షన్స్ తో మాకేం సంబంధం.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..!

Manchu Vishnu Shocking Comments On Pawan Kalyan
Manchu Vishnu Shocking Comments On Pawan Kalyan
Manchu Vishnu Shocking Comments On Pawan Kalyan
Manchu Vishnu Shocking Comments On Pawan Kalyan

మా ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది సినీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు మెగా కాంపౌండ్ సపోర్ట్ తో ప్రకాష్ రెచ్చిపోతుంటే.. మరోవైపు మంచు విష్ణు కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నాడు. ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఇండస్ట్రీ సభ్యులు తెలుగు ఫిలిం ఛాంబర్ వైపు ఉంటారా.. పవన్ కళ్యాణ్ వైపు ఉంటారా’.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలతో మెగా కాంపౌండ్ ని టార్గెట్ చేశాడు మంచు విష్ణు. దీంతో ‘పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అంత ఉండదు మీ బడ్జెట్.. మీరా పవన్ పై మాట్లాడేది’ అంటూ విష్ణుపై ఘాటైన విమర్శలు చేశాడు ప్రకాష్ రాజ్. దీంతో ఒక్కసారిగా మా ఎలెక్షన్స్ హీటెక్కిపోయాయి. ప్రకాష్ కౌంటర్ తో మెగా-మంచు వార్ లా మారిపోయాయి ‘మా’ ఎన్నికలు. చిరంజీవిని విమర్శిస్తూ మోహన బాబు కూడా మీడియాకెక్కుతున్నాడు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు కూడా ప్రకాష్ రాజ్ కి మరోక కౌంటర్ ఇస్తూ పవన్ కళ్యాణ్ మ్యాటర్ ని తీసుకొచ్చాడు. పవన్ సినిమా కలెక్షన్స్ ఎంతైతే ఏంటి.. ఇండస్ట్రీలో ఇంకా చాల మంది చిన్న హీరోలు ఉన్నారు.. కేవలం నలుగురు ఐదుగురు మాత్రమే పెద్ద హీరోలు ఉంటారు. నేను అందరి పక్షాన ఉంటా అంటూ కౌంటర్ ఇచ్చాడు మంచు విష్ణు.

తాజాగా ఒక సోషల్ మీడియా ఇంటర్వ్యూ లో ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ మ్యాటర్స్ పై ఓపెనప్ అయ్యాడు మంచు విష్ణు. ‘ప్రకాష్ రాజ్ ఎం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్ధం కావటం లేదు. మొన్న ఆయన మాట్లాడుతూ ఒక హీరో ఓపెనింగ్ కలెక్షన్స్ అంత మా సినిమా బడ్జెట్ ఉండదని నీచంగా మాట్లాడాడు. ఇండస్ట్రీలో కేవలం 4,5 స్టార్ హీరోలు ఉంటారు. మిగితా వారంతా చిన్న హీరోలే. మరి వారికేదైనా సమస్య వచ్చి మా దెగ్గరికి సహాయానికి వస్తే.. ఆ హీరో కార్ కాస్ట్ అంత ఉండదు మీ సినిమా బడ్జెట్ అని తిప్పి పంపిస్తామా.. ప్రకాష్ రాజ్ అయితే అలానే చేస్తాడేమో. నేను పోటీ చేస్తుందే.. చిన్న, వృద్ధ నటులకి సహాయం చేయడానికి. ప్రకాష్ రాజ్ కి భాష సరిగ్గా రాదు. క్రమశిక్షణ లేని జీవితం. అప్పట్లో శ్రీనువైట్ల టీమ్ ని పచ్చి బూతులు తిడితే ఈయన్ని సినిమా నుండి తొలగించారు. నేను షూటింగ్ 7గం అంటే పది నిమిషాల ముందే వెళ్తాను. ఆయన అసలు ఆ రోజు షూటింగ్ కి వస్తాడో లేడో కూడా తెలీదు. ఆయన మంచి నటుడు మాత్రమే.. మంచి వ్యక్తి మాత్రం కాదు. నా గురించి మాట్లాడేటప్పుడు ప్రకాష్ రాజ్ బీపీ టాబ్లెట్స్ వేసుకొని మాట్లాడాలి’ అంటూ ప్రకాష్ రాజ్ పై దిమ్మతిరిగే కౌంటర్లు వేశాడు మంచు విష్ణు.