శ్రీహరి అంకుల్ తో వచ్చి.. మా నాన్న కాళ్ళు పట్టుకున్నావ్.. ప్రకాష్ రాజ్ గుట్టు విప్పిన మంచు విష్ణు..!

manchu vishnu strong counter to prakash raj
manchu vishnu strong counter to prakash raj
manchu vishnu strong counter to prakash raj
manchu vishnu strong counter to prakash raj

ఎన్నికల తేదీ దెగ్గరపడుతున్న కొద్దీ మా ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు మెగా కాంపౌండ్ సపోర్ట్ తో ప్రకాష్ రాజ్ రెచ్చిపోతుంటే.. మరోవైపు మంచు విష్ణు కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నాడు. దీంతో మెగా-మంచు వార్ లా మారిపోయాయి ‘మా’ ఎన్నికలు. చిరంజీవిని విమర్శిస్తూ మోహన బాబు కూడా మీడియాకెక్కుతున్నాడు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు కూడా ప్రకాష్ రాజ్ కి మరోక కౌంటర్ ఇస్తూ పవన్ కళ్యాణ్ మ్యాటర్ ని తీసుకొచ్చాడు. ఇవన్నీ సరిపోవన్నట్టు తాజాగా మా ఎన్నికల్లో మరో వివాదం చోటుచేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ లో తనకి అనుకూలంగా 60మందితో మంచు విష్ణు ఓట్లు దొంగతనంగా వేయించుకున్నాడని సంచలన ఆరోపణలు చేశాడు ప్రకాష్ రాజ్. ఇంత అన్యాయంగా మాపై గెలవాలని చూస్తున్నారు. వెంటనే ఈ అన్యాయంపై చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలందరూ స్పదించాలని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యాడు ప్రకాష్ రాజ్. దీంతో వెంటనే ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇచ్చాడు మంచు విష్ణు. ఓడిపోతున్నామన్న నిరాశలో ప్రకాష్ రాజ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మా నాన్న గురించి కూడా వాగుతున్నావ్. శ్రీహరి అంకుల్ తో కలిసి వచ్చి మా నాన్న కాళ్ళు పట్టుకున్నావ్ ఆ సంగతి ఏంటో చెప్పాలా.. అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు అంటూ ఆవేశంతో ఊగిపోయాడు మంచు విష్ణు.

ఇక తన ప్యానల్ సభ్యులతో కలిసి మంచు విష్ణు మాట్లాడుతూ.. చిన్నా, పెద్దా అని చూడకుండా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతున్నారని, పెద్దలను గౌరవించకపోతే సర్వనాశనం అవుతారని ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. ప్రకాశ్ రాజ్ మగాడైతే, దమ్ముంటే నన్ను ధైర్యంగా ఎదుర్కోవాలి! అంటూ విష్ణు సవాల్ విసిరారు. నేడు శ్రీహరి అంకుల్ మన మధ్యన ఉండుంటే ప్రకాశ్ రాజ్ కు తగిన గుణపాఠం చెప్పేవారు. శ్రీహరి అంకుల్ తో వచ్చి మా నాన్న కాళ్ళు తాకావు అది మర్చిపోకు. ఇక ఇలా మాట్లాడుతూనే.. నాలుగు రోజుల క్రితం మా ఇంటికి రాజ్ శేఖర్ అంకుల్ వచ్చి ఏమన్నారో చెప్పమంటావా అంటూ విష్ణు ప్రకాష్ రాజ్ ని హెచ్చరించాడు. ఈ సందర్భంగా మంచు విష్ణు… సీనియర్ నటి జీవితపైనా విరుచుకుపడ్డారు. జీవిత గారూ… మరోసారి మా నాన్న పేరు ఎత్తవద్దు అని స్పష్టం చేశారు. మోహన్ బాబు పేరెత్తే అర్హత జీవితకు లేదని అన్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ కు కూడా విష్ణు వార్నింగ్ ఇచ్చారు. శ్రీకాంత్ గారూ… మీరు నోరెత్తితే బాగుండదని పేర్కొన్నారు. ఇక డ్రామాలు ఆడుతున్న ప్రకాశ్ రాజ్ కోసమే పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు జరిపించాలని కోరాం. పోస్టల్ బ్యాలెట్ అంశంలో నా ప్రమేయం లేదు” అని విష్ణు స్పష్టం చేశారు.