మా సభ్యులంతా సిద్ధంగా ఉండండి.. మీకో వార్త చెప్పబోతున్నా..  మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ ట్వీట్

machu Vishnu sworn in as ‘MAA’ president at filmnagar

సినిమాను మించిన ట్విస్టుల నడుమ పూర్తయిన మా ఎన్నికల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. భారీ మెజారిటీతో గెలిచిన విష్ణు.. ఎన్నికలకు ముందు ప్రచారంలో నేను మంచి పనులు చేస్తా.. నన్ను గెలిపించడం అంటూ హామీలిచ్చారు. ఎన్నికల కంటే ముందే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి తన సొంత ఖర్చులతో బిల్డింగ్ నిర్మిస్తానని చెప్పాడు. రెండు స్థలాలను కూడా వెతుకుతున్నానని అన్నాడు.


తాజాగా మా అధ్యక్షుడి హోదాలో ఓ ప్రకటన చేశాడు మంచు విష్ణు. మా సభ్యులందరికీ రేపు ఓ గుడ్ న్యూస్ చెప్తా అంటూ ప్రకటించాడు. ట్విట్టర్లో మంచు విష్ణు చేసిన పోస్ట్.. ఇప్పుడు చర్చనీయాంశమైంది. మా సభ్యులకు మంచి వార్త చెప్పబోతున్నా అంటూ ట్వీట్ చేశాడు. విష్ణు ట్వీట్ తో ఆయన చెప్పే ఆ గుడ్ న్యూస్ ఏంటో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.