మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసిన మా అధ్యక్షుడు మంచు విష్ణు

Manchu vishny Meets Minister Talasani Srinivas Yadav
Manchu vishny Meets Minister Talasani Srinivas Yadav
Manchu vishny Meets Minister Talasani Srinivas Yadav
Manchu vishny Meets Minister Talasani Srinivas Yadav

ఎన్నో వివాదాలు.. రసాభసల మధ్య జరిగిన ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఈరోజు మర్యాదపూర్వకంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు.. కోశాధికారి శివబాలాజీతో పాటు మంత్రి తలసానిని కలిశారు. ఈ నెల 16న జరిగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా మంచు విష్ణు మంత్రిని ఆహ్వానించారు. మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.