త్రిపుర నూత‌న సీఎంగా మాణిక్ సాహా

త్రిపుర బీజేపీ శాఖ అధ్య‌క్షుడు మాణిక్ స‌హా రాష్ట్ర నూత‌న సీఎంగా ఎంపిక‌య్యారు. ఇవాళ బిప్ల‌వ్‌దేవ్ కుమార్ దేవ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై త‌మ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా మాణిక్ స‌హాను ఎన్నుకున్నారు.

వృత్తిరీత్యా దంత వైద్యుడైన మాణిక్ స‌హా.. ఈ ఏడాది ప్రారంభంలో త్రిపుర నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 2016లో కాంగ్రెస్ పార్టీని బీజేపీలో చేరారు. 2020లో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడిగా నియ‌మితుల‌య్యారు.