సెంట్ర‌ల్ హెల్త్ మినిస్ట‌ర్ మాండ‌వీయ‌పై పండిప‌డ్డ‌ మన్మోహన్‌సింగ్‌ కుమార్తె

Former PM Manmohan Singh tests positive Covid-19, admitted to AIIMS

Former PM Manmohan Singh tests positive Covid-19, admitted to AIIMS

సెంట్ర‌ల్ హెల్త్ మినిస్ట‌ర్ మన్సుఖ్‌ మాండవీయపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె మండిప‌డ్డారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న త‌న తండ్రి ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తన తల్లిదండ్రులు జూలోని జంతువులేమీ కాదని, వారి ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడాన్ని ఆమె తప్పుపట్టారు.

డెంగ్యూ వ్యాధికి గురైన మన్మోహన్‌ సింగ్‌.. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హెల్త్ మినిస్ట‌ర్ మన్సుఖ్ మాండవియా శుక్రవారం దవాఖానకు వ‌చ్చి ప‌రామ‌ర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను మాండవీయ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈ ఫొటోల్లో మన్మోహన్ సింగ్ మంచం మీద పడుకుని ఉండగా.. ఆయన భార్య పక్కన నిలబడి ఉన్నారు. ఈ ఫోటోల‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. దీంతో కేంద్ర మంత్రి మాండవియా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటోలను తొలగించారు.

ఈ ఫోటోల వివాదంపై మన్మోహన్‌ సింగ్‌ కుమార్తె డామన్‌ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రి వచ్చి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే, పరామర్శిస్తున్న సమయంలో ఫొటోలను తీసుకోవడంపై అమ్మ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా బ‌ల‌వంతంగా ఫొటోలు తీసుకున్నారు. దీనిపై అమ్మ చాలా బాధపడింది. వాళ్లేమీ జూలో జంతువులు కాదు కదా? కొంచెమైనా నైతికత, మెడిక‌ల్ ఎథిక్స్ పాటించాలి కదా? అని మండిప‌డ్డారు. అస‌లు ఫొటోగ్రాఫర్‌ని ఎయిమ్స్‌ వైద్యులు, మేనేజ్‌మెంట్ ఎలా లోపలికి అనుమతించారో చెప్పాలని పలువురు నెటిజెన్లు విరుచుకుప‌డుతున్నారు.