మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి - TNews Telugu

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతిMaoist Leader Ramakrishna Was died
Maoist Leader Ramakrishna Was died

మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ మృతి చెందారు. సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆర్కే అనారోగ్యంతో చనిపోయినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధృవీకరించారు. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్నారు. వరంగల్ ఎన్ఐటీలో బిటెక్ పూర్తిచేసిన హరగోపాల్ ఆర్కేగా చలామణి అయ్యారు. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆర్కే ప్రధాన సూత్రధారుడిగా ఉన్నారు. మాజీ సీఎం చంద్రబాబుపై దాడి కేసులో కూడా ఆర్కే నిందితుడిగా ఉన్నారు.

ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. నాలుగేళ్ల క్రితం బలిమెల ఎన్‌కౌంటర్‌లో ఆర్కేకు బుల్లెట్ గాయమైంది. 2004 అక్టోబర్ 15న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్కే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆర్కేపై పోలీస్ శాఖ గతంలో రూ.50 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.

నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో ఆర్కే కీలక నేతగా కొనసాగుతున్నారు. సౌతిండియాలో మావోయిస్టు పార్టీ బలోపేతానికి ఆర్కే తీవ్ర కృషి చేశారు. ఏపీ, తెలంగాణలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలు దఫాలుగా పోలీసుల నుంచి తప్పించుకున్నారు.