గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన మార్గరెట్ అల్వా

Margaret Alva

మానవ మనుగడకు చెట్లు జీవనాడులన్నారు విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా. ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు నివాసంలో.. రాజ్యసభ సభ్యుడు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, ఇతర టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి ఆమె మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మార్గరెట్ అల్వా… ఒకప్పుడు కాలుష్యరహితంగా ఉండే ఢిల్లీ ఇవాళ కాలుష్య ఖార్ఖానాగా మారిపోయింది. కాలాలతో సంబంధం లేకుండా కాలుష్యం ప్రజల్ని పీల్చిపిప్పిచేస్తోంది. మనం చూస్తుండగానే ఢిల్లీలోకి ఆక్సిజన్ సెంటర్స్ వచ్చాయి. ఈ కాలుష్యం ఇలాగే పెరుగుతూ పోతే.. భవిష్యత్ తరాల పరిస్థితి ఊహించుకుంటేనే భయానకంగా ఉంది. మనం ఎప్పుడో మేలుకొని చేయాల్సిన కార్యాన్ని ఇప్పుడు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్.. దేశమంతా మొక్కలు నాటిస్తున్నారు. మనిషి శాశ్వతం కాదు.. కానీ భవిష్యత్ తరాల బాగుకోసం చేసే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ప్రజల హృదయంలో పదిలంగా ఉంటాయి. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతున్న సంతోష్ కుమార్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలంతా తమ బాధ్యతగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు మార్గరెట్ అల్వా.

ఈ కార్యక్రమంలో.. రాజ్యసభ సభ్యులు, సంతోష్ కుమార్, లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, దామోదర్ రావు, కె.ఆర్. సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, లోక్ సభ సభ్యులు రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, రాములు, పసునూరి దయాకర్, తదితరులు పాల్గొన్నారు.