కాటేదాన్‌ లో భారీ అగ్నిప్రమాదం

fire attack on women in Andhra Pradesh
fire attack on women in Andhra Pradesh

రాజేంద్రనగర్‌ పరిధిలోని కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ స్పాంజ్‌ల గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చేలరేగి క్షణాల్లో వ్యాపించాయి. దీంతో పక్కనే ప్లాస్టిక్‌ గోదాముకు మంటలు అంటుకోవడంతో తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం.

అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ఇంజిన్లతో ఘటనాస్థలానికి చేరుకొని రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఆస్తినష్టం ఎంతమేర జరిగిందో తెలియాల్సి ఉంది. కరెంట్ షార్ట్ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.