శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం యూఏఈ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 10లక్షలకు పైగా విదేశీ కరెన్సీని గుర్తించిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈవై – 275 విమానంలో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన అలియా భాను అనే ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతడి వద్ద 10 లక్షలకు పైగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం అతడిని ఆధీనంలోకి తీసుకున్నారు.