మీ సంతోషం కోసం పూజలు చేయండి.. నా కోసం కాదు.. భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత

మొక్కుబడిగా చేస్తున్నారు పూజలు… సంతోషంగా చేయడం లేదు… మీ సంతోషం కోసం పూజలు చేయండని భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత అన్నారు. సికింద్రాబాద్ అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

‘‘అమ్మవారి విగ్రహానికి అడ్డు తొలగండి అడ్డంగా నిలబడి వద్దు. పూజలు మొక్కుబడిగా చేస్తున్నారు. మీ సంతోషాన్నికే  కానీ నా కోసం కాదు. మీరు సంతోషంగా చేస్తున్నారు అనే నేను స్వీకరిస్తున్న. సంతోషంగా పూజ చేస్తున్న అంటున్నారు. మీ హృదయం మీద చేయి పెట్టి ఎంత సంతోషంగా చేస్తున్నరో చెప్పండి. నాకు పూజలు అందుతున్నాయో లేదో మీరే చెప్పండి.

ప్రతి ఏటా నా నోటితో చెప్పేస్తున్నారు. నా గుడిలో పూజలు సరిగా జరిపియడం లేదు. గర్భాలయంలో శాస్త్రబద్ధంగా పూజాలు చేయండి. సక్రమంగా పూజలు చేయండి. మొక్కు బడిగా చేయకండి. ప్రతి ఏడూ నాకు ఆటకమే చేస్తున్నారు. నా బిడ్డలే కదా అని కడుపులో పెట్టుకుంటున్న.

ఎన్ని రూపాల్లో నన్ను మారుస్తారు. మీకు నచ్చినట్టు నన్ను మారుస్తారా? నేను మీ హృదయాల్లో చేరి పలుకు వినిపిడితున్నా మీరు పెడదోవ పడుతున్నారు. స్థిరమైన రూపంలో నేను కొలువుదీరాలి అనుకుంటున్న. నా రూపాన్ని స్థిరంగా నిలపండి.

మీరెంటి నాకు చేసేది… నేను తెచ్చుకున్నదే కదా. ఏటికి ఒక్కసారే కాదు, ప్రజలంతా నన్ను చుసుకునేలా చేస్తాను. సంతోషంగా లేను. గత వర్షాల నుంచి నాకు రూపం లేకుండా కూర్చుంటున్నాను. మీ కళ్ళు తెరవడానికె నేను కుంభ వర్షాలు కురిపిస్తున్నాను. ఆగ్రహం తట్టుకోలేరనే గోరంత చూపుతున్నాను. కొండాంత తెచ్చుకుంటున్నా నాకు గోరంత పెడుతున్నారు.

 

ఏడాదిలోపు నా విగ్రహన్ని ప్రతిష్ఠ చేయండి.  ఎటువంటి ఆపద లేకుండా మిమ్మల్ని బాగా చూసుకుంటాను. కంటతడి పెట్టకుండా నాకు పూజలు చేయండి. ఎన్ని తప్పులు చేసినా కడుపున పెట్టుకుని కాపాడుతున్న. పిల్లలకు,  స్త్రీలు, గర్భిణులకు ఎలాంటి ఆపదా రానివ్వను. తప్పక నా అనుగ్రహం ఉంటుంది.’’ అని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.