ఓటీటీ లో విడుదలకు సిధ్దమవుతున్న మెగా అల్లుడి సినిమా

గ‌త ఏడాది కరోనా సృష్టించిన కల్లోలానికి సినీ పరిశ్రమ ఎన్నో కష్టాలను ఎదుర్కుంది. తొమ్మిది నెల‌ల పాటు థియేట‌ర్స్ మూత ప‌డడంతో.. చిన్న హీరోల సినిమాలే కాదు పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీల బాట ప‌ట్టాయి. ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతంగా విస్తరిస్తుండడంతో మ‌ళ్లీ అవే ప‌రిస్థితులు ఎదురవుతున్నాయి. పెద్ద సినిమాలతో పాటు, చిన్న సినిమాలు కూడా అమేజాన్ ప్రైమ్, ఆహా, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో విడుదలవుతున్నాయి.

ఇప్పుడు మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ న‌టించిన “సూప‌ర్ మ‌చ్చి సినిమా” కూడా  కానున్న‌ట్టు సమాచారం. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.వ‌చ్చే నెల‌లో ఈ సినిమాను ఆహాలో స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్టు తెలిసింది. చిత్రంలో ర‌చితా రామ్‌తో పాటు ఒక కీల‌క పాత్రలో అజ‌య్‌ నటిస్తోన్నాడు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు.