పండగ వేళ.. మెగాస్టార్ స్నేహితుడు.. హీరో విజయ్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం..!

chiranjeevi friend actor vijay kumar daughter emotional post about her niece anitha deth
chiranjeevi friend actor vijay kumar daughter emotional post about her niece anitha deth
chiranjeevi friend actor vijay kumar daughter emotional post about her niece anitha deth
chiranjeevi friend actor vijay kumar

సీనియర్ హీరో విజయ్ కుమార్ అంటే తమిళనాడులో తెలియని వారుండరు. ఈయన మెగాస్టార్ చిరంజీవికి కూడా అత్యంత సన్నిహితుడు, మిత్రుడు. వీరిద్దరూ కలిసి చేసిన ‘స్నేహం కోసం’ మూవీ అప్పట్లో మంచి విజయం సాధించింది. తాజాగా నవరాత్రి ఉత్సవాల వేల ఈ సీనియర్ హీరో విజయ్ కుమార్ తమ్ముడి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విజయ్ కుమార్ తమ్ముడి కూతురు అనిత గుండె పోటుతో హఠాన్మరణం చెందింది. ఈ విషయాన్నీ విజయ్ కుమార్ కూతురు వనిత విజయ్ కుమార్ చెప్తూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తన కూతురు సమానురాలైన 20ఏళ్ళ తన మేనకోడలిని కోల్పోవటంతో వనిత కన్నీరుమున్నరైంది. ఈమేరకు సుధీర్ఘ పోస్ట్ చేస్తూ తన బాధను అందరితో పంచుకుంది.

chiranjeevi friend actor vijay kumar daughter emotional post about her niece anitha deth
chiranjeevi friend actor vijay kumar daughter emotional post about her niece anitha deth

‘ఉదయమే ఓ విషాదకర వార్తను వింటూ లేచాను. నా ఇరవై ఏళ్ల మేనకోడలు అనిత చనిపోయింది. న్యూ ఢిల్లీలో సర్జరీ చేసుకున్న తరువాత గుండెపోటు వచ్చింది. చివరకు తుది శ్వాస విడిచింది. నాకు ఆమె దేవుడిచ్చిన కూతురులాంటిది. నా పెద్ద కూతురులాంటిది. మా నాన్న విజయ్ కుమార్ సొంత సోదరుడి కూతురు ఇంద్ర (సింగపూర్‌లో ఉంటుంది) కూతురే అనిత. నన్ను, నా పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేది. కానీ ఇలా మా అందరినీ వదిలేసి వెళ్లిపోయింది. ఇప్పుడు నా గుండె గుండెబద్దలైనట్టు అనిపిస్తోంది. మాటలు రావడం లేదు. ఇంకా షాక్‌లో ఉన్నట్టు అనిపిస్తోంది.ఆ బాధలోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ నవరాత్రి ఉత్సవాలు కూడా ఇక చేసుకోను. నా పాప వంటి అనిత కోసం నేను ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాను’ అని వనిత ఎమోషనల్ అయింది.