జగన్ పై చిరంజీవి అసంతృప్తి.. మధ్యలో మంచు విష్ణు పంచాయితి.. మొదలైన కొత్త రచ్చ..!

Netizens Trolling On Manchu Vishnu Over AP Govt Online Ticket Prices Issue
Netizens Trolling On Manchu Vishnu Over AP Govt Online Ticket Prices Issue

ఏపీ ప్ర‌భుత్వ తీరుపై చిరంజీవి అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా టిక్కెట్స్ విష‌యంలో ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. ఆన్ లైన్ టికెటింగ్ బిల్ ప్ర‌వేశ‌పెట్ట‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం అంటూనే టికెట్ రేట్లను కాలానుగుణంగా మార్చుకునే అవకాశం ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దేశంలోని మిగతా రాష్ట్రాల‌లో ఉన్న విధంగా టికెట్ ధ‌ర‌ల‌లో కూడా అదే వెసులు బాటు ఉండ‌డం స‌మంజ‌సమన్నారు. ద‌య‌చేసి ఈ విష‌యంపై పున‌రాలోచన చేయాలని మెగాస్టార్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చేసిన ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో కొత్త చర్చ నడుస్తుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాడాలి కానీ విజ్ఞప్తులు, రిక్వెస్ట్‌లు చేస్తే కుదరదు అని పవన్ కళ్యాణ్ ఆనాడు రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అన్న మాటలని గుర్తుచేస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

చిరంజీవి ఒక పెద్దమనిషిలా మాట్లాడాడు.. కానీ హక్కుల కోసం రిక్వెస్ట్ చేయటం కంటే ఇండస్ట్రీ సమస్యలపై ఫైట్ చేయాలనీ కొందరు డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో ఇండస్ట్రీ పెద్దలు పవన్ కళ్యాణ్ అభిప్రాయాలని వ్యక్తిగతంగానే చూడాలని అన్నారు. అనవసరంగా ఏపీ ప్రభుత్వంతో గొడవలకి దిగదలుచుకోలేదని.. జగన్ మంత్రులని కలిసి విన్నవించుకున్నారు. ఇక ఇదే అంశాన్ని రిపీట్ చేస్తూ చిరంజీవి జగన్ ని విజ్ఞప్తి చేసిన తీరుపై నెటిజన్స్ పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక ఇంకొందరైతే మరింత వెరైటీగా స్పందిస్తూ.. ఈ ఇష్యులోకి మంచు విష్ణుని కూడా మధ్యలోకి లాగేశారు. ఇండస్ట్రీ సమస్యల్లో ఉన్నప్పుడు అందరు ఏకం కావాలని అంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఎక్కడున్నాడని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద విష్ణు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్.