ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

minister errabelli dayakar rao visits Inavolu Mallanna Swamy

ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం దర్శించుకున్నారు. స్వామి వారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలు విముక్తి పొంది పాడిపంటలతో సతోషంగా జీవించాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

అంతకుముందు ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఐనవోలు ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. మంత్రి వెంట వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు తదితరులు ఉన్నారు.