19 జిల్లా డయాగ్నస్టిక్ హబ్ లు ప్రారంభిస్తాం : మంత్రి ఈటల

Minister Etala Rajender Comments About Corona Vaccination
Minister Etala Rajender Comments About Corona Vaccination

రేప‌ట్నుంచి 19 జిల్లాలో డ‌యాగ్నొస్టిక్ హ‌బ్‌లు ప్రారంభిస్తామ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్నవారికి జిల్లా డ‌యాగ్నొస్టిక్ కేంద్రాల్లో ర‌క్త ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న వారు 3, 4 రోజుల‌కోసారి ర‌క్త ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలో మెడిసిన్, ఆక్సిజ‌న్ సిలిండర్లు ఎక్కువ ధ‌ర‌కు అమ్మితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ర్ట‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రాలకు చెందిన రోగుల‌కు కూడా చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు.

Minister Etala Rajender Comments About Corona Vaccination
Minister Etala Rajender Comments About Corona Vaccination

కేంద్రం కేటాయించే వ్యాక్సిన్ల‌ను బ‌ట్టి రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌న్నారు. టీకాలు వ‌చ్చే ప‌రిస్థితిని బ‌ట్టి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తామ‌న్నారు. 3.5 కోట్ల టీకాలు 3 నెల‌ల్లో ఇవ్వాల‌న్న లక్ష్యం పెట్టుకున్నట్టు మంత్రి తెలిపారు. వ్యాక్సిన్ దిగుమ‌తి చేసుకునేందుకు కేంద్రం అనుమ‌తి ఇస్తుందా? అని ప్ర‌శ్నించారు. ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి టీకా వేసే అవకాశాల గురించి చర్చిస్తున్నామన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ, కొవిడ్ ప‌రీక్ష‌లు వేర్వేరు కేంద్రాల్లో ఉండాల‌న్న వాద‌న ఉందని.. ఈ అంశంపై ఆలోచిస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యాక్సిన్ల కోసం ప‌క‌డ్బందీగా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తామ‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు.