మంత్రి గంగుల కమలాకర్ కు కరోనా పాజిటివ్‌

Minister Gangula Kamalakar tested Corona positive

Minister Gangula Kamalakar tested Corona positive

బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు గంగుల స్వయంగా ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా ఐసోలేట్ కావాలని.. కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు.

హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా మంత్రి గంగుల టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన గత రెండు రోజులుగా జలుబు, జ్వరంతో బాధ పడుతున్నారు. దీంతో కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలడంతో హోంక్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

అయితే ప్రస్తుతం గంగుల ఆరోగ్యం నిలకడగానే ఉందని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. కానీ ఇటీవల హుజురాబాద్ ప్రచారంలో మంత్రితో కలిసి పాల్గొన్నవారు, ఇటీవల ఆయనను వ్యక్తిగతంగా కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని… అవసరమైతే హోం క్వారంటైన్ లోనే ఉండాలని సూచించారు.