గెల్లు శ్రీను గెలుపు శ్రీను కాబోతున్నాడు : మంత్రి హరీష్ రావు

Minister Harish Rao Comments On Etala Rajender At Kamalapur Meeting
Minister Harish Rao Comments On Etala Rajender At Kamalapur Meeting

హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం భీంపల్లి మండలంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఈ ఎన్నికల్లో గెల్లు శ్రీను గెలుపు శ్రీను కాబోతున్నాడు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు నీతి లేదని ఈటల రాజేందర్ అంటున్నాడు.. అసలు ఈటల రాజేందర్ కే రీతి లేదు. కేసీఆర్ కు మానవత్వం లేదన్న ఈటల.. కేసీఆర్ మానవత్వం గురించి సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్దిదారులను అడుగు చెప్తారు అని సూచించారు.

Minister Harish Rao Comments On Etala Rajender At Kamalapur Meeting
Minister Harish Rao Comments On Etala Rajender At Kamalapur Meeting

ఈటలకే నీతి, జాతిలేదు. ఒకప్పుడు బీజేపీని తిట్టిన ఈటల… బీజేపీలో చేరడం ఏ నీతి అని ఆయన ప్రశ్నించారు. నాపుట్టుకే వామపక్షం అన్న ఈటలకు ఆ సిద్ధాంతం గుర్తు రాలేదా.. పదవి కోసం ఈటల అన్నింటిని పక్కన బెట్టారని ఎద్దేవా చేశారు. ధరలు పెంచి రైతులపై ఆర్థికభారం మోపుతున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలి అని హరీష్ రావు ప్రశ్నించారు. మాటతప్పని మడమతిప్పని నేత కేసీఆర్.. ఐదేళ్ల క్రితం కేసీఆర్ నాలుగువేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తే.. ఈటల రాజేందర్ ఒక్క ఇల్లు కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఈటల తన బాధను ప్రజల బాధగా మార్చాలని చూస్తున్నారు. ప్రజలకు అంతా తెలుసని.. ఏ నిర్ణయం తీసుకోవాలో వారికి బాగా తెలుసని మంత్రి హరీష్ రావు అన్నారు.