ధరలు పెంచే బీజేపీ కావాలా.. పేదలను ఆదుకునే టీఆర్ఎస్ కావాలా..

Minister Harish Rao wishes to all the teachers on the occasion of Teachers' Day

పెద్దమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. వచ్చే అరు నెలల్లో గుడి పూర్తి చేసుకొని బోనాలు సమర్పించుకున్నం. ఇక్కడ ఇన్ని దేవాలయాలు ఉన్న రోడ్డు ఉండకపోవడం సరైంది కాదు.  చిలుక వాగు బ్రిడ్జి కోసం కోటి రూపాయలు మంజూరు చేసినట్టు మంత్రి చెప్పారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో రంగనాయకుల గుట్ట దగ్గర పాటిమిది ఆంజనేయ స్వామి జ్ఞాన సరస్వతి దేవాలయంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్.. ప్రత్యేక పూజలు నిర్వహించి, పెద్దమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. టీఆరెఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. 30 లక్షల రూపాయలతో ఈ దేవాలయాన్ని అద్భుతం గా తీర్చి దిద్దుతం. గతం ఉన్న మంత్రి ఒక్క డబుల్ బెడ్ రూం కూడా కట్టలేదు. హుజూరాబాద్ నియోజక వర్గంలో ముఖ్యమంత్రి కేసీఅర్ నాలుగు వేల ఇండ్లు ఇచ్చిన ఒక్క ఇల్లు కట్టలేదని ఈటలపై మండిపడ్డారు.

ఇల్లు క్కట్టించే బాధ్యత తీసుకుంట

స్థలం ఉన్న వారికి డబ్బులు ఇచ్చి ఇల్లు క్కట్టించే బాధ్యత తీసుకుంట.. ఒక్క ఇల్లు కట్టని ఈటల రాజేందర్ కు ఓటు వేస్తే ఎలా అభివృద్ది చేస్తాడు. అభివృద్ది కావాలంటే గేల్లు శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించండి. నెల నెలా గ్యాస్ ధర పెంచి సబ్సిడీ తగ్గిస్తుందని బీజేపీపై మండిపడ్డారు.

ప్రజల మీద బీజేపీ భారం వేస్తుంది

నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజల మీద బీజేపీ భారం వేస్తుంది. ధరలు పెంచే బీజేపీ కావాలా.. పేద ప్రజలను ఆదుకునే టీఆరెఎస్ కావాలా అలోచించండి. ఇంకా రెండేళ్లు టీఆరెఎస్ అధికారంలో ఉంటుంది. కరోనా సమయంలో పేద ప్రజలను అదుకున్నం. సెంటిమెంట్లు ఓట్లతో కడుపు నిండదు.. పని చేసే వాళ్ళను ఆదరించాలి మంత్రి హరీష్ రావు కోరారు.

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలన్నారు. గతం లో ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసిన వ్యక్తి ఇప్పటి వరకు పెద్దమ్మ తల్లి కి పూజ చేయలేదు. చిలుక వాగు కోటి రూపాయలతో పాటు రోడ్డు కు 40 లక్షలు మంజూరు చేసింది ప్రభుత్వం. అభివృద్ది జరుగలంటే కేసీఅర్ ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు.