కిషన్ రెడ్డివి డొంక తిరుగుడు మాటలు: మంత్రి హరీష్ రావు

Harish Rao

టీఆర్ఎస్ పార్టీకి 777 ఓట్లు ఉన్నాయి.. ఎంతమంది నామినేషన్లు వేసిన ఇబ్బంది లేదు… 20వతేదీ తర్వాత ఎవరి బలం ఏంటో తెలుస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మా పార్టీకి సంపూర్ణ బలం ఉంది.. మొదటిసారి ఎన్నికల కమిషన్ ఈ సారి ఎమ్మెల్యేలకు కూడా ఓటు హక్కు కల్పించనుందన్నారు.

కిషన్ రెడ్డికి ఆ విషయం కూడా తెల్వదా?

గల్లీ బీజేపీ వరి వేయాలంటారు.. ఢిల్లీ బీజేపీ వరి వద్దు అని అంటున్నారు… ఇలా చెప్పి ఎవరిని ఆగం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతులను చిన్న చూపు చూసే విధంగా, కించ పరిచే విధముగా మాట్లాడు తున్నారు. కేంద్రం యాంసగిలో రారైస్ కొంటాం అని అన్నారు.. యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుంది కానీ రా రైస్ రాదు అనే విషయం కిషన్ రెడ్డికి తెలువదా…?

రైతుల మీద ప్రేమ ఉంటే..

రాష్ట్రంలో రైతులకు సమస్య లేదు అని కిషన్ రెడ్డి అనడం కరెక్ట్ కాదు. గ్రామాల్లోకి వచ్చి రైతులను అడగండి ఏం సమస్యలు ఉన్నాయో చెబుతారు. కిషన్ రెడ్డి డొంక తిరుగుడు మాటలు చెప్పి రైతులను ఆగం చేయాలని చూస్తున్నాడు. గతంలో కొన్న వడ్లు ఇంకా గోడౌన్ లలో ఉన్నాయి. కిషన్ రెడ్డికి రైతుల మీద ప్రేమ ఉంటే రైల్వే అధికారులతో మాట్లాడి వాటిని త్వరగా ఇక్కడి నుండి బయటకు పంపాలని సూచించారు.

గత ప్రభుత్వాలు కొన్నాయి కదా?

గతంలో అధికారంలో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వలు యాసంగిలో వడ్లు కొన్నారు. అందుకే ఇప్పుడు మేము అడుగుతున్నాం. కొంతమంది నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. రైతులను కార్లు ఎక్కించిన పార్టీ బీజేపీ పార్టీ. కేంద్రమంత్రి కొడుకును ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ప్రశ్నించారు.

రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు

రైతుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు. ఎరువుల ధరలను పెంచి, డీజిల్ ధరలను పెంచి రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. మెదక్ జిల్లాలో ఇప్పటికే 2లక్షల 70 వేల క్వింటాల వడ్లు కొన్నాం. రైతులు ఆగం కావొద్దు అనేది టిఆర్ఎస్ పార్టీ ఆరాటం. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేద్దాం అంటే కిషన్ రెడ్డి ముందుకు రాలేదని విమర్శించారు.