సంగారెడ్డి జిల్లాలో డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు - TNews Telugu

సంగారెడ్డి జిల్లాలో డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు



Minister Harish Rao inaugurated telangana  diagnostic center in Sangareddy district
file photo

సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుప‌త్రిలో రూ. 2 కోట్ల యాభై లక్షలతో ఏర్పాటు చేసిన‌ తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 19 సెంటర్లను ప్రారంభించ‌డం జరిగిందని, మరో 16 సెంటర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ డ‌యాగ్న‌స్టిక సెంట‌ర్లు పేదలకు ఎంతో ఉపయోగకరం కానున్నాయని చెప్పారు. ఈ కేంద్రాల‌తో పేదలు పైసా ఖర్చు లేకుండా 57 రకాల వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని చెప్పారు.

సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో త్వరలో రేడియాలజీ విభాగాన్ని ప్రారంభించనున్నామ‌ని, రెండు కోట్ల వ్యయంతో సి.టి.స్కాన్ ను ఏర్పాటు చేయనున్నామ‌ని తెలిపారు. రూ. 550 కోట్లతో సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో మెడికల్ కళాశాలను నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాల మంజూరు చేశారని చెప్పారు.

1200 మంది వైద్య సిబ్బంది తో జిల్లాలో వైద్య కళాశాలకు మంజూర‌య్యాయని మంత్రి చెప్పారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా 100 సీట్ల నర్సింగ్ కళాశాల మంజూరైంద‌ని ,ఇటీవలే కేబినెట్ ఆమోదించింద‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎం.పి. కొత్తా ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎంఎల్ఏ మాణిక్ రావు, కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు