బొగ్గు గని ప్రమాదంలో కార్మికుల మృతిపై హరీష్ రావు దిగ్భ్రాంతి

Harish Rao

మంచిర్యాలలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ-3  బొగ్గు గని ప్రమాదంలో నలుగురు కార్మికుల మృతిపై ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ-3  బొగ్గు గని పై కప్పు కూలి నలుగురు కార్మికులు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. కార్మికుల  కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతి చెందిన కార్మిక కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు.