దళిత బంధును ఆపింది బీజేపీనే.. రుజువు చేస్తా.. ఎవరు వస్తరో రండి.. హరీష్ రావు సవాల్

దళిత బంధును ఆపింది బీజేపీనే.. ఈ నెల ఏడో తేదీన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేఖ రాసింది నిజం.. ఎన్నికల కమిషన్ కు లేఖ రాయడం వల్లే దళిత బంధు ఆగింది.. దీన్ని రుజువు చేస్తా.. ఏ బీజేపీ నేత వస్తరో రండి.. అంటూ బీజేపీ నేతలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు సవాల్ విసిరాడు. జమ్మికుంటలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ లతో కలిసి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు.

కేసీఆర్.. నా పెద్ద కొడుకు

‘‘నడుమంతర ఓట్లు వచ్చాయి. నాలుగు నెలల నుంచి రణ గొణ చప్పుళ్లు వింటున్నం. ఓటు ఎవరికి వేయాలి. ఓటు వేస్తే ఎం జరుగుతది..కొద్దిగా ఆలోచించాలి. ఏ తోవలో వెళ్తే మనకు లాభం. ఏ దారిన వెళ్తే డబులు బెడ్ రూం ఇళ్లువస్తది. మనకు అన్నం పెట్టే వాళ్లు ఎవరు…మనకు సున్నం పెట్టే వాళ్లు ఎవరు ఆలోచించాలి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ తెచ్చిన పార్టీ. తెలంగాణ కోసం కొట్లాడి. కాదనుకున్న తెలంగాణను తెచ్చిపెట్టిండు కేసీఆర్. తెచ్చుకున్న తెలంగాణలో 200 పెన్షన్ 2016 రూపాయలు చేసుకున్నం. నా కన్నకొడుకు చూసినా చూడకపోయినా నా పెద్ద కొడుకు కేసీఆర్ రూ. 2016 పంపుతున్నరు అని ప్రతీ అవ్వ అంటోంది.

పేదలందరికీ దళిత బంధు వస్తది

ఆడ పిల్ల పెండ్లి పెట్టుకుంటే పేదింటికి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఏ ప్రభుత్వం అయినా సాయం చేసిందా ఆలోచించాలి. మొదటి ఏడాది పేదవాళ్లయిన ఎస్సీలకు 50 వేలు ఇచ్చిండు. తర్వాత బీసీలకు ఇచ్చిండు. ఆ తర్వాత అన్ని కులాలు,  మతాల వారిలో పేదలకు లక్ష నూట పదహార్లు ఇచ్చిండు. రేపు దళిత బంధు కూడా ఇలా పేదలందరికీ వస్తది. బీజేపీ వాళ్లు  ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్తూ…. మన మనసులు కరాబు చేస్తరు. బీజేపీ వాళ్లు అసలు  ఏం చేస్తరో మాత్రం చెప్పడం లేదు. నేను చెప్పిన ఆసరా పెన్షన్ ఇవ్వండ లేదా.. పేదింటి ఆడపిల్లకు లక్ష నూట పదహార్లు రావడం లేదా.. కేసీఆర్ కిట్ రావడం లేదా. సీఎం కేసీఆర్ పేదలను కాపాడాలని 12 వేలు, కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి ఆటో కిరాయి ఇచ్చి ఇంటికి పంపుతున్నరు. ప్రజలకు ఏం కావాలో ఆలోచిస్తున్న ప్రభుత్వం. అంగన్ వాడీలో బాలామృతం, కోడి గుడ్లు ఇస్తున్నం. పిల్లల పెద్దయితే గురుకులాల్లో సన్న బియ్యంతో బోజనం పెట్టి, ఇంగ్లీషు మీడియంలో చదవిస్తున్నం.

21 రోజుల్లో 16 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి

24 గంటల కరెంటు ఇస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా..బీజేపీ ఏం చేసింది. రాజేందర్  చేరిన పార్టీ బీజేపీ. దీని పేరు జీడీపీగా మార్చాలి. గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచే పార్టీగా పేరు మార్చుకోవాలి. ఈ బీజేపీ పాలనలో ఈ 21 రోజుల్లో 16 సార్లు పెట్రోల్ , డీజీల్ ధరలు పెంచిండ్రు. దీంతో రవాణా చార్జీలు పెరిగి ఉప్పు, పప్పు, కూరగాయలు, నూనె ధరలు పెరిగాయి. ఇన్ని ధరలు పెంచినా రాజేందర్  నాకు ఓటు వేయండి అంటున్నరు. రూ.500 నుంచి రూ.250 కి గ్యాస్ సబ్సిడీ తగ్గించారు. దాన్ని రూ.40 కి తగ్గించారు. గ్యాస్ ధర మాత్రం రూ.1030 రూ చేశారు. మమ్మల్ని గెలిపిస్తే పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గిస్తమని చెప్పారు. తగ్గించకపోగా డబుల్ చేసిండ్రు. రాజేందర్ గ్యాస్ సిలండర్  తగ్గించమని అడిగే, రాష్ట్ర ప్రభుత్వం రూ.291 పన్ను వేస్తోంది.  అది తగ్గించు అన్నరు. నేను జమ్మికుంట గాంధీ విగ్రహం వద్దకు వస్తా. రూ.291 పన్ను రాష్ట్ర ప్రభుత్వం వేస్తే నేను అక్కడే రాజీనామా చేసి నేలకు ముక్కు రాసి వెళ్తా అన్నా. రావాలి కాదా.. రాలేదు. తెలు కుట్టిన వ్యక్తిలా వెళ్లిపోయారు.

రైళ్లు, బీఎస్ఎన్ ఎల్, విమానాశ్రయాలు అమ్ముతున్నరు

బీజేపీ  ప్రభుత్వమే వేయి రూపాయలు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం పన్ను లేనే లేదు. మీరు ఆలోచించాలి. పెన్షన్, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇచ్చి సాయం చేసిండ్రు కేసీఆర్. వాళ్లేమి చేస్తున్నరు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి. ఉద్యోగాలు ఊడగొట్టిండ్రు. రైళ్లు, బీఎస్ఎన్ ఎల్, విమానాశ్రయాలు అమ్ముతున్నరు.  నెల రోజులు ఓపిక పట్టండి పెద్ద నోట్లు రద్దు చేస్తున్నం. జన్ ధన్ అక్కౌంట్లు ఓపెన్ చేయండి. ధనా దన్ డబ్బులు వెస్తాం అన్నారు. నెల రోజులు తిప్పారు. తప్ప నల్ల ధనం బయటకు రాలేదు. విదేశాల నుంచి నల్ల ధనం తెచ్చి ప్రతీ అక్కౌంట్లో 15 లక్షలు వేస్తాం అన్నరు. వచ్చినయా పైసలు అక్కౌంట్ల లోకి. రాజేందర్, బీజేపీకి ఓటు  ఎందుకు వేయాలి అని అడుగుతున్న.

బరువు మా మీద పెట్టండి. కారుకు  ఓటు వేయండి

రాష్ట్రంలో మంత్రులంతా  ఇల్లు కట్టించాం. కాని హూజూరాబాద్ లో ఎందుకు ఇళ్లు కట్టించలేదు. మంత్రిగా ఇళ్లు కట్టించలేని రాజేందర్ ప్రతిపక్ష  ఎమ్మెల్యేగా కడతడా అయితదా ఆలోచించండి. 30 వ తేదీతో ఓట్లు అయితది. తర్వాత సీఎం ఎవరు ఉంటరు. కేసీఆర్ గారే ఉంటరు. ఆర్థిక మంత్రి గా నేను,  జిల్లా మంత్రిగా కొప్పుల ఈశ్వర్ ఉంటరు. మేం మాటిస్తున్నాం. ఐదు వేల ఇళ్లు కట్టిస్తాం. స్వంత జాగా ఉంటే ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తం. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించాలి. నెలకు రెండు సార్లు హూజూరాబాద్ కు వస్తా. ఏ పనులైతే హమీ ఇచ్చినమే.. మేం దగ్గరుండి పనులు నడిపిస్తా అని హామీ ఇస్తున్నా. కొన్ని పనులు జరుగుతున్నయి జమ్మికుంటలో. బరువు మా మీద పెట్టండి. కారుకు  ఓటు వేయండి. ఈ బ్రిడ్జి బాగాలేదని అన్నా… రాజేందర్ మెడ మీద కత్తిపెట్టి కట్టిండని, వాస్తు పోయిందని ఇక్కడి ప్రజలు అంటున్నరు.

గెల్లును గెలిపిస్తే.. కుటీర పరిశ్రమలు తీసుకు వస్తాం

తన స్వార్థం కోసం రాజీనామా చేసిండ్రు. రాజేందర్ గెలిస్తే బీజేపీకి లాభం. గెల్లు గెలిస్తే… ఇక్కడి ప్రజలకు లాభం. నాయిని చెరువును బాగు చేయాలన్నరు. నాయిన చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతం.  ఆడిటోరియం లేదు.  ఆరు సార్లు గెలిచిండు. ఒక్క టౌన్ హాలు ఉందా.. ఒక్క మహిళా భవనం ఉందా. సబ్ రిజిస్ట్రార్ ఆపీసు ఉందా… హౌసింగ్ బోర్డు  వర్షాలు పడితే వరదల మయం. ఆగమాగం.  మంత్రిగా ఉండి ఏం పట్టించుకున్నరు. వరద కాలువకు ఎన్ని డబ్బులు ఖర్చయినా.. శాశ్వత పరిష్కారం అందిస్తా. గెల్లు శ్రీనును గెలిపించండి. ఈ ప్రాంతంలో కుటీర పరిశ్రమలు వస్తే పనులు  దొరుకుతాయంటున్నరు. తప్పకుండా గెల్లును గెలిపించండి. కుటీర పరిశ్రమలు తీసుకు వస్తాం.

దళితబంధు ఆపమని బీజేపీ లేఖ రాసింది

వడ్డీలేని రుణం పండుగ ముందు  అందించాం. అగ్గిపెడతా..కూలగొడతా…ఘోరీ కడతా…. అంటున్నడు తప్ప సేవ చేస్తా అంటున్నడా.. తిడితే కడుపు నిండుతదా.. గ్యాస్ ధర తగ్గిస్తవేమో చెప్పు. ఇవాళ దళిత బంధు సీఎం ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి  ఎన్నికల కమిషన్ కు ఈ నెల 7వ తేదీన లేఖ రాసిండు. అధికార దుర్వినియోగం అవుతుందని,   ఈ డబ్బులు వస్తే ఆ పార్టీకి లాభం చేకూరుతుందని లేఖ రాస్తే. ఈ నెల 30 వ తేదీ వరకు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ప్రేమేందర్ రెడ్డి లేఖ రాసినట్లు రుజువు చేయడానికి నేను రడీగా ఉన్న. ఏ బీజేపీ నాయకుడు వస్తడో ముందుకు రండి. ఏడు రోజులు ఆపుతరు అంతే. గెల్లుకు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ కు పేరు వస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి లేఖ రాసి దళిత బంధును ఆపిండ్రు. రెండో తేదీ తర్వాత వస్తం. నేను కొప్పుల ఈశ్వర్ అన్న దగ్గరుండి  దళితులందరికీ యూనిట్లు గ్రౌండ్ చేయిస్తం. 30వ తేదీ తర్వాత ఎవరు ఉంటరు ఇక్కడ. ఎవరూ ఉండరు. సీఎంగా కేసీఆర్ ఉంటరు. మేమే ఉంటం. కారు గుర్తుకు ఓటు వేయండి.’’ అని మంత్రి హరీష్ రావు కోరారు.

రూ.60 కోట్ల పనులు జరుగుతున్నయి

మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ‘‘మూడు నెలల నుంచి ఒకటే చర్చ. ఎన్నికలు వచ్చినయి. ఓటు ఎటు వేయాలా.. గందరగోళం పడాల్సిన అవసరం లేదు. మహిళలను అమ్మా ఓటు ఎటు వేస్తరు అని అడిగితే. టీఆర్ఎస్ పుట్టినప్పటి నుండి మేం కారు గుర్తుకే ఓటు వేస్తమని అంటున్నరు. కేసీఆర్ వెంట ఉండి ఎందుకు మనం కన్ఫ్యూజ్ అవుతున్నం.  ఈటల రాజేందర్ మొన్నటి దాక కేసీఆర్ తో ఉన్నరు కదా… అని అలోచిస్తున్నరు. టీఆర్ఎస్ పార్టీని వదిలి పెట్టి వెళ్లింది ఎవరు. మనం టీఆర్ఎస్ వదల లేదు కదా.. పోయిన వ్యక్తితో మనకు ఎం సంబంధం. ఆరు సార్లు ఎమ్మెల్యే అయిండు. రెండు సార్లు మంత్రి అయిండు. రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, సంఘ భవనాలు లేవు, ఇళ్ల పట్టాలు లేవు, పెన్షన్ లెవు, కొత్త కార్డు లేవు. ఇక్కడ అంతా అస్తవ్యస్తమైన పరిస్థితి. మేం వచ్చాక అనేక సమస్యలు చెబుతుంటే  అక్కడికక్కడే పరిష్కరిస్తున్నం. ఆటోనగర్ లో వాళ్లు ఇల్లు విడిచి వెల్లారు. ఎంటి అంటే నీళ్లు రావడం లేదంట. పైపు లైన్  ఎక్సెటన్షన్ చేసి అధికారులను ఆదేశిస్తే నీరు వచ్చేది.  అలాంటి మంత్రి పదవి ఉండి పట్టించుకోలేదు. అధికారంలో ఉండి పేదలకు సేవలు ఎంత దూరం అందించావని అడుగుతున్న. ఇప్పటికీ  ఎక్కడి వేసిన గొంగళి అక్కడే. మేం వచ్చాక  రూ.60 కోట్ల పనులు జరుగుతున్నయి. మేం రావడం వల్ల నష్టం జరిగిందా…లాభం జరిగిందా… వంద కోట్లు అయితే ఇక్కడి రోడ్లు, డ్రైన్లు బాగవుతయి. ఇది అభివృద్ధి. ఇలా చేయాల్సి ఉంది.

రాజేందర్ వెళ్లి ధరలు దించగలుగుతరా?

బీజేపీ పార్టీలోకి ఎందుకు వెళ్లాడో అర్థమవుతలేదు. ఎందుకు రాజీనామా చేసిండో అర్థమవుతలేదు. ఎమన్నా అంటే  ఆత్మగౌరవం అంటడు. రాజేందర్ కుఇచ్చినంత గౌరవం సీఎం ఎవరికీ ఇవ్వలేదు. ఎన్నోసార్లు సీఎం.. రాజేందర్ ని పొగిడారు. ఆయన పెట్టుకున్న పంచాయతీ ఇది.   భూముల పంచాయతీలు పెట్టుకుని ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు.  ఈ పంచాయతీలన్నీ.. హూజూరాబాద్ ప్రజల పంచాయతీగా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నరు.   అసలు హూజూరాబాద్ ప్రజలకు ఈటల భూముల పంచాయతీకి ఎం సంబంధం. ప్రజలంతా రాష్ట్రంలో సుఖశాంతులతో ఉన్నారు. పోయి పోయి బీజేపీలో చేరారు. ఏ ఉద్దేశంతో బీజేపీలో చేరారు.  బీజేపీ అధికారంలోకి వచ్చిన నాడు గ్యాస్ ధర రూ.318 రూపాయలు ఉన్నది. ఇపుడు రూ.1036 రూపాయలు అయింది. డీజిల్ రేటు, పెట్రోల్ రెటు పెరిగింది. నిత్యావసర వస్తువల ధరలు పెరిగింది. రాజేందర్ వెళ్లి ధరలు దించగలుగుతరా. బీజేపీ పార్టీ ప్రశాంతంగా ఉన్న రైతుల మీద నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి బావుల వద్ద మీటర్లు పెడుతారంట.  కళ్లాలు ఎత్తేస్తరంట. మీరు వెళ్లి అమ్ముకోండి అంటున్నరు. అంటే ప్రభుత్వం చేతులెత్తేసి రైతులను నడి రోడ్డు మీద వదులుతోంది. ఏం చూసి రాజేందర్ బీజేపీలో చేరారు. రాజేందర్ ను చూసి బీజేపీకి ఓటు వేయాలా… బీజేపీని చూసి రాజేందర్ కుఓటు వేయాలా..  అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరుగుతోంది. రూ.1882 నుండి రూ.1960 రూపాయలకు వడ్ల ధర పెంచే నిర్ణయం సీఎం తీసుకున్నరు.’’ అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. చంచల్ గూడ జైలుకు వెళ్లా..

టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘2001 నుండి తెలంగాణ ఉద్యమంలో పని చేశా. ఇక్కడ  చదివి ఉస్మానియా లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. చంచల్ గూడ జైలుకు వెళ్లా.. ఈ ఉపఎన్నికలో కేసీఆర్ పిలిచి  హూజూరాబాద్ ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకో. నీ ద్వారా ఆ సమస్యలు పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు. ఉద్యమంలో ఎంత నీతిగా పని చేసిన్నో అదే రీతిలో హుజూరాబాద్ ప్రజలకు సేవ చేస్తా. నాకు హైదరాబాద్ లో ఆస్తులు లేవు, వ్యాపారాలు లేవు. వేరే వాళ్లకు ఓటు వేస్తే వాళ్లకు పార్ట్ టైం జాబ్… నాకు ఓటు వేస్తే నేను ఫుల్ టైం జాబ్. ఇక్కడే పుట్టి పెరిగిన. వ్యవసాయ పనులు చేసా. జమ్మి కుంటతో మంచి అనుబంధం ఉంది.  రాబోయే రోజుల్లో సీఎం ని కలిసి హుజూరాబాద్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ వచ్చేలా  చూస్తా.. మెడికల్ కాలేజీ వస్తే ఉచితంగా వైద్యం అందించే అవకాశం ఉంది. గెలుస్తే  ఈ పని గెల్లు శ్రీను చేస్తడు తప్ప. ఈటల రాజేందర్ వల్ల కాదు. జమ్మికుంటలోని  నాయిని చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా.  చాలా మంది జమ్మికుంటలో నిరుద్యోగులు ఉన్నారు. పోటీ పరిక్షలకు సిద్ధమవడానికి సీఎంతో చెప్పి స్టడీ సెంటర్ ఏర్పాటు చేయిస్తా.. డిజిటల్ లైబ్రరీ రూ.3-4 కోట్లతో ఏర్పాటు చేయిస్తా. హూజూరాబాద్ నుంచి పెద్దపల్లి వరకు 4 లైన్ల రోడ్ వేసి ఉంటే, పారిశ్రామిక కారిడార్ ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ పని చేయిస్తా. జమ్మికుంటలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో వందేళ్ల కు సరిపడా మాస్టర్ ప్లాన్ తయారు చేయిస్తా. జమ్మికుంటను ఉత్తమ మున్సిపాలిటిగా తీర్చిదిద్దుతా. హెల్త్ సెంటర్ ను   ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేయిస్తా.’’ అని అన్నారు.