ఖరీఫ్ ఏర్పాట్లు, ధాన్యం కొనుగోళ్లపై మంత్రి హరీష్ రావు సమీక్ష

Minister Harish Rao Tele Conference With District Health Officers
Minister Harish Rao Tele Conference With District Health Officers

Covid livelihood during the difficult times for teaching and non-teaching staff working in private educational institutions : Harish rao

కోవిడ్ నియంత్రణ, ఖరీఫ్ ఏర్పాట్లు, ధాన్యం కొనుగోళ్లపై సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఎంపి బిబి పాటిల్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిలతోపాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులనూ నిత్యం తనిఖీ చేయాలన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో అదనపు బిల్లులు వసూలు చేస్తే.. ఆసుపత్రి గుర్తింపు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు.

బ్లాక్ ఫంగస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. కొత్తగా మంజూరు అయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని సంగారెడ్డి  జిల్లా ఆసుపత్రిలోనే నిర్మిద్దామని మంత్రి హరీష్ ప్రాతిపాదించారు. సంగారెడ్డి ఎడ్యుకేషన్ హబ్‌ అయ్యిందన్నారు.