ప్రజలు సహకరిస్తే కరోనా కట్టడి సాధ్యమవుతుంది.. మంత్రి హ‌రీష్ రావు

Covid livelihood during the difficult times for teaching and non-teaching staff working in private educational institutions : Harish rao

ప్రజలు సహకరిస్తే కరోనా కట్టడి సాధ్యమవుతుందని, జిల్లాలో 240 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో 600 బెడ్స్ కు అనుమతి ఇచ్చామ‌ని, రెమ్ డేసివిర్ ఇంజక్షన్లు అవసరమైన మేర జిల్లాలో నిల్వలున్నాయని మంత్రి చెప్పారు.

మెదక్ కలెక్టరేట్ లో పలు శాఖల అధికారులతో ఇవాళ మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. ఇందులో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డితోపాటు వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. అంత‌కుముందు మెదక్ మార్కెట్ కమిటీ ఆవరణలో దుకాణాల సముదాయం మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో బీహార్ కూలీలు వెళ్లిపోవడంతో హమాలీల సమస్య ఏర్పడిందన్నారు. ప్రైవేటు ట్రాక్టర్లతోనూ ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు చేరవేసేందుకు ఆదేశాలిచ్చామన్నారు.

మెద‌క్‌ జిల్లాలో ఇప్ప‌టికే లక్ష మందికి వ్యాక్సిన్ వేశార‌ని, నేటి నుండి సెకండ్ డోస్ వేసే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. జిల్లాలో లక్షా 40 వేల కుటుంబలను ఇంటింటి సర్వే చేయగా 6 వేల మందికి కరానా లక్షణాలు ఉన్నట్లు తేలిందని గుర్తు చేశారు.