రాజేంద్రా మీ సభలకు మేం కరెంట్ కట్ చేయలేదు.. జనరేటర్ లో డీజిల్ అయిపోయినట్టుంది చూస్కో - TNews Telugu

రాజేంద్రా మీ సభలకు మేం కరెంట్ కట్ చేయలేదు.. జనరేటర్ లో డీజిల్ అయిపోయినట్టుంది చూస్కోరాజేంద్రా.. మీ సభలకు మేం కరెంట్ కట్ చేస్తున్నాం అని ప్రచారం చేసుకుంటున్నావ్. పెరిగిన డీజిల్ ధరల ఎఫెక్ట్ వల్ల నీ జనరేటర్ లో డీజిల్ అయిపోయినట్టుంది చూస్కో. కరెంట్ కట్ చేయాల్సిన అవసరం మాకు లేదు అంటూ హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు చురకలంటించారు మంత్రి హరీష్ రావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండలంలోని ఓ ఫంక్షన్ హాల్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఈటల రాజేందర్ సమావేశం మధ్యలో కరెంట్ పోవడంతో టీఆర్ఎస్ నాయకులే కావాలని కరెంట్ కట్ చేశారంటూ ఆరోపించాడు. కాగా.. దీనిపై మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు.

Minister Harish Rao Strong Counter To Etala Rajender in Jammikunta Election Campaign
Minister Harish Rao Strong Counter To Etala Rajender in Jammikunta Election Campaign

జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మంత్రి హ‌రీష్ రావు ఈటల రాజేందర్ కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. రాజేంద్రా.. కేంద్రం పెంచిన డీజిల్ ధ‌ర‌ల వ‌ల్లే నీ స‌భ‌ల‌కు అంత‌రాయం క‌లుగుతోంది.. అంటూ చుర‌కలంటించారు. ఈట‌ల రాజేంద‌ర్ స‌భ‌లు నిర్వ‌హిస్తున్న ఫంక్ష‌న్‌హాల్‌కు క‌రెంట్ కనెక్ష‌న్ లేద‌ని, బిల్లులు చెల్లించ‌కుంటే క‌ట్‌ చేశార‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. ప్ర‌స్తుతం ఆ ఫంక్ష‌న్‌హాల్ జ‌న‌రేట‌ర్‌తో న‌డుస్తుంద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం డీజిల్ ధ‌ర‌లు పెంచ‌డంతో ఫంక్ష‌న్‌హాల్ నిర్వాహ‌కులు త‌క్కువ డీజిల్ వాడుతున్న‌ట్టున్నార‌ని, అందుకే డీజిల్ అయిపోయి క‌రెంట్ స‌ప్లై నిలిచిపోయిందని.. ఈ విషయం తెలుసుకోకుండా టీఆర్ఎస్ పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నావ్ అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు మానుకో. నీకే మంచిది అంటూ ఈటలకు మంత్రి హరీష్ రావు హితవు పలికారు.