కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మంత్రి హరీష్ రావు దంపతులు

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయాన్ని మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. సతిమేతంగా విచ్చేసిన ఆయనను ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం హరీష్ రావు దంపతులు ప్రత్యేక పూజాలు చేశారు. వారికి అర్చకులు వేదశీర్చనం అందజేశారు. హరీష్ దంపతులతో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, రవి శంకర్ కూడా స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.