తెలంగాణలో ఇంటింటా తిరంగ జెండా

Minister Jagadish Reddy

స్వతంత్ర వజ్రోత్సవాల ప్రాశస్త్యాన్ని వర్తమాననికి అందించేందుకు ఉద్యుక్తులు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు గాను ప్రతి ఒక్కరు స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 8 నుండి 22 వరకు వజ్రోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శనివారం సాయంత్రం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షత న నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా వజ్రోత్సవ సన్నహాక సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

భారతదేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్రను నేటి యువతకు తెలియ జెప్పే విదంగా కార్యక్రమాల రూపకల్పన జరిగిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. అందులో భాగంగానే ఈ నెల 9 న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపాలిటీలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఇంటింటికి త్రివర్ణ పతాకాన్ని అందిస్తామన్నారు. ప్రతి ఇంటి మీద రెపరేప లాడే తిరంగ జెండా రూపంలో వర్తమాననికి స్వాతంత్ర పోరాట ఉద్యమ చరిత్ర బోద పడేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ నెల 8 న హైదరాబాద్ లో 9 నుండి జిల్లాల వారిగా కార్యక్రమాల రూపకల్పన జరిగిందన్నారు.

ఇక ఈ నెల 9 న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనీ అన్ని మున్సిపాలిటీ లలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రతి ఇంటికి జాతీయ జెండాను అందిస్టారన్నారు.10 న వన మహోత్సవం,11 న ఫ్రీడమ్ రన్,12 న జాతీయ సమైక్యతా రక్షా బంధన్,13 న అన్ని గ్రామపంచాయతీ లలో ర్యాలీలు మూడు రంగుల బెలూన్ ల ఎగరవేత,14 న జానపద కళాకారుల ప్రదర్శనలు,15 న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు,16 న తెలంగాణ రాష్ట్ర సామూహిక ఆలాపనా,17 న రక్తదాన శిబిరాలు18 న జిల్లా స్థాయిలో ఉద్యోగులకు,యువతకు క్రీడా పోటీలు, 19 న వయో వృద్ధులు,అనాధల ఆశ్రమాలలో స్వీట్లు, పండ్లు పంపిణీ,20 న రంగోలి,21న చివరి రోజున జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ లతో గ్రామ పంచాయతీ/ యు ఎల్ \బి సి లలో ప్రత్యేక సమావేశాల నిర్వహణ ఉంటుందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.