విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేయండి : మంత్రి కొప్పుల

Minister Koppula Eshwar Review Meeting About Hostels Re-Open
Minister Koppula Eshwar Review Meeting About Hostels Re-Open

గురుకులాల్లో విద్యార్థులకు ఏలోటు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో ప్రారంభించిన గురుకుల విద్యాలయాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల పేద పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. జులై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సోమవారం మసాబ్‌ ట్యాంక్‌లోని సంక్షేమభవన్‌లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపే అన్ని ఏర్పాట్లు చేయాలని, విద్యాసంస్థలు, హాస్టల్‌ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు.

Minister Koppula Eshwar Review Meeting About Hostels Re-Open
Minister Koppula Eshwar Review Meeting About Hostels Re-Open

 

 

విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యత ప్రిన్సిపాల్స్, వార్డెన్లదే అని.. ఏదైనా సమస్య ఉంటే వెంటనే స్పందించాలని మంత్రి సూచించారు. హాస్టళ్లు తెరుచుకునే నాటికి.. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో సహా అన్నీ సిద్ధం చేసుకోవాలన్నారు. ఇంకా వ్యాక్సిన్‌ వేసుకోని గురుకులాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఇతర సిబ్బందికి టీకాల కోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 మహిళా డిగ్రీ కళాశాలలు ప్రారంభించుకున్నామని, పురుషుల డ్రాప్‌ అవుట్స్‌ను తగ్గించి వారికి ఉన్నత విద్యను అందించేందుకు వీలుగా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనువైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా హాస్టళ్లలో డైట్‌ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వ ఆలోచిస్తున్నదని తెలిపారు. దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ రూ.1,000 కోట్లతో సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీంను ప్రకటించిన నేపథ్యంలో ఈ పథకానికి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.