నోరుజారిన నిర్మలమ్మ.. ఆడుకున్న కేటీఆర్.. వీడియో వైరల్

ktr satires on nirmala sitharaman tongue slip
ktr satires on nirmala sitharaman tongue slip

నేతలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకసారి నోటి నుంచి టంగ్ స్లిప్ అయితే ఇక వెనక్కి తీసుకోవడం ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. మీడియా ముందు కానీ కాన్షియస్ గా లేకపోతే.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లా అభాసుపాలు అవుతుంటారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టంగ్ స్లిప్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల జీఎస్టీ పెంపులో భాగంగా ‘గుర్రపు పందేలా’పై జీఎస్టీ గురించి మాట్లాడేటప్పుడు నిర్మలా సీతారామన్ పొరపాటున హార్స్ ట్రేడింగ్ పై జీఎస్టీ అన్నారు. దీనిపై ఆమెని పెద్ద ఎత్తున ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్నారు.

హార్స్ ట్రేడింగ్‌పై జీఎస్‌టీ విధించాలనే నిర్మలా సీతారామన్ ప్రతిపాదనను ఆహ్వానిస్తున్నామని సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్స్. అయితే ప్రధాని, హోం మంత్రి ఈ యాంటీ బీజేపీ ట్యాక్స్‌ను అనుమతించకపోవచ్చన్నారు. ‘నిజం బయటపడుతుందా? గుర్రపు వ్యాపారంపై జీఎస్టీ! దయచేసి ముందుకు వెళ్ళండి’ అంటూ సీతారామ్ ఏచూరి వ్యాగ్యంగా ట్వీట్ చేశారు. ఇక కేటీఆర్ సైతం నిర్మలా సీతారామన్ పై అద్దిరిపోయే కౌంటర్ వేశాడు. తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ నిర్మలా టంగ్ స్లిప్ పై మాట్లాడుతూ.. ‘దీన్నే ఇంగ్లీషులో ఫ్రూడియన్ స్లిప్ అని, హిందీలో మన్‌కీ బాత్‌ అంటారు’ అంటూ వ్యంగాస్త్రాలు సంధిస్తూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కాగా గా జిఎస్‌టి కౌన్సిల్ ప్రెస్ మీట్ సందర్భంగా.. ‘హార్స్ రేసింగ్’పై జిఎస్‌టికి బదులుగా ‘హార్స్-ట్రేడింగ్’పై జిఎస్‌టి అన్నారు నిర్మలా సీతారామన్‌. బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినోలు, హార్స్‌ రేసింగ్‌పై జిఎస్‌టి గురించి ఆమె మాట్లాడారు.