పనికిమాలిన వారి మాటలు నమ్మి మోసపోవద్దు: కేటీఆర్

ktr

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ పర్యటించిన మంత్రి కేటీఆర్.. తొలుత సిరిసిల్ల పట్టణం రాజీవ్ నగర్ లో తంగళ్ళపల్లి శివారులో మానేర్ నదిలోని చెక్ డ్యామ్ లో ప్రమాదవశాత్తు పడి మరణించిన ఆరుగురు విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

మానేర్ నదిలోని చెక్ డ్యామ్ లాంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దుర్ఘటన జరిగిన ప్రదేశములో హెచ్చరిక బోర్డులు పెట్టాలని అధికారులకు సూచించారు. నీరు పైకి ఒకే రకముగా కనిపిస్తుందని, కానీ కింద ఒకే రకముగా ఉండదని కేటీఆర్ చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలని, పిల్లలు గమనించాలని సూచించారు.

ktr

వానాకాలం పంటను ప్రభుత్వం పూర్తిగా కొంటుంది

జిల్లాలో 52 వేల మెట్రిక్ టన్నులు కొన్నామని, ఇంకా 3 లక్షల టన్నుల పంట కొనవలసి వస్తుందన్నారు. తడిసిన ధాన్యం కూడా కొనే ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 4,743 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని గుర్తు చేశారు.

రాజ్యాంగం ప్రకారం దాన్యం కొనుగోలు విషయములో కేంద్రం రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉండాలి. రాష్ట్రములో వ్యవసాయానికి నీటీ వసతులకు కేంద్రం ఎలాంటి సహాయాన్ని అందించలేదు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయమనే నిర్ణయాన్ని కేంద్రం పునర్ సమీక్షించుకోవాలి. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు కూర్చోబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు.

ధనం కావాలి కానీ, ధాన్యం వద్దా?

కేంద్రానికి తెలంగాణ ధనం కావాలి కానీ, ధాన్యం వద్దు అనే కేంద్ర విదానాన్ని వ్యతిరేకిస్తున్నాం. కేంద్రం రెండు నాల్కల ధోరణిని ఎండగట్టబోతున్నాం. స్థానిక బీజేపీ నాయకులు అసత్య ప్రచారాన్ని నమ్మి వరి వేస్తే రైతు నష్ట పోతాడు. యాసంగి వరి ధాన్యం కొనే విషయం నిజమైతే, రాతపూర్వకముగా కేంద్రం పూర్తి పంట కొంటామని రాసి ఇవ్వాలి. లేని పక్షములో బండి రెండు చెంపలు పగులకొట్టి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలి. ముఖ్యమంత్రి ఆలోచనలు నమ్మండి. పనికిమాలిన వారి మాటలు నమ్మి మోసపోకండని కేటీఆర్ రైతులను కోరారు.