చిన్నారి ప్రాణానికి అండ‌గా నిలిచిన మంత్రి కేటీఆర్

ఆప‌ద‌లో ఆదుకునే ఆప‌ద్భాంధ‌వుడు మంత్రి కేటీఆర్.. వింత‌ జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న ఓ చిన్నారి ప్రాణానికి అండ‌గా నిలిచారు.

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగీతం గ్రామానికి చెందిన ఓ చిన్నారి వింత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నది. వ్యాధి నయం చేయించేందుకు చిన్నారి తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఈ జ‌బ్బును న‌యం చేసేందుకు పెద్ద మొత్తంలో డ‌బ్బు అవ‌స‌రం ప‌డుతుంద‌ని డాక్టర్లు చెప్పారు.

అంత డ‌బ్బు లేక పాప త‌ల్లిదండ్రుల వ‌ద్ద దిక్కుతోచ‌ని స్థితిలో ఉండిపోయారు. ఈ విషయాన్ని ఓ యువకుడు ట్విట్ట‌ర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చాడు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఆ పాపకు ఆపరేషన్ చేయిస్తానని.. వ్యాధి పూర్తిగా తగ్గే వరకు పూర్తి సహకారం అందిస్తాన‌ని భ‌రోసానిచ్చారు.

పాప అనారోగ్య స‌మ‌స్య‌ను త‌న దృష్టికి తీసుకొచ్చినందుకు సదరు యువకుడికి కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. కేటీఆర్ చెప్పిన విధంగానే డాక్టర్లు ఇవాళ పాపను పరిశీలించి.. వివరాలు తెలుసుకున్నారు.