సిరిసిల్లలో వరద ఉధృతి.. మంత్రి కేటీఆర్ సమీక్ష

Minister KTR Direction to Sircilla District Authority and Irrigation Department officials

భారీ వ‌ర్షాల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలోని పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి.  ప‌ట్ట‌ణంలో వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్‌ల‌తో మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫ‌రెన్స్ తో సమీక్షించారు.

భారీ వర్షాలతో నీటమునిగిన సిరిసిల్ల పట్టణంలోని కాలనీల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వరద ముంపున‌కు గురైన ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలని సూచించారు.

సహాయక చర్యల కోసం హైద‌రాబాద్‌ నుంచి డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నామన్నారు. ప్రజలెవ‌రూ ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రంగం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.

 

సిరిసిల్ల జ‌ల‌మ‌యం.. వరద నీటిలో కాలనీలు