సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ - TNews Telugu

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడఖమ్మం జిల్లా పరిధిలో సీఎంఆర్‌ఎఫ్‌కి దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన చెక్కులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.

మొత్తం 94 మందికి రూ.42.58 లక్షల విలువైన చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. ఇవాళ్టి వరకు రూ.5.83 కోట్ల విలువైన చెక్కులు అందజేయడం సంతోషంగా ఉందని మంత్రి పువ్వాడ ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.