అభివృద్ధి పనులను సమీక్షించిన మంత్రి పువ్వాడ

Minister Puvvada Ajay Kumar thanked Chief Minister KCR for allocating a huge budget to TSRTC

ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్, సుడా పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్షించారు.

పారిశుధ్యం, చెత్త సేకరణ, రోడ్లు, డ్రైన్స్, పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులు, గుర్తించి చేయాల్సిన పనులు, మిషన్ భగీరథ, తదితర పనులపై మున్సిపల్, పబ్లిక్ హెల్త్, పంచాయతీ రాజ్, అటవీ, విద్యుత్ తదితర శాఖ అధికారులతో మంత్రి పువ్వాడ సమీక్షించారు.

హాజరైన కలెక్టర్ ఆర్.వీ కర్ణన్ , మేయర్ పునుకొల్లు నీరజ , సుడా చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ లు స్నేహాలత, మధుసూదన్ రావు.