రైతుబంధు సంబరాలు.. ట్రాక్టర్ నడిపిన మంత్రి సబిత

Minister Sabita Indrareddy

రైతుబంధు సంబరాల్లో భాగంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్రాక్టర్ నడిపారు. మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో రైతు సంబరాల్లో పాల్గొన్న మంత్రి సబితా.. ఎడ్ల బండి, ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్రాక్టర్ నడిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి సబిత అన్నారు.