తొలిరోజు 40 శాతం విద్యార్థులు బడికొచ్చారు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Minister Sabitha Indra Reddy
Minister Sabitha Indra Reddy

రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు బడులు తెరుచుకున్న సందర్భంగా 40 శాతం మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నిబంధనలు పాటిస్తూ పాఠశాలను ప్రారంభించాము. గ్రామపంచాయతీ, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పాఠశాలలు శానిటైజేషన్ చేశామని మంత్రి తెలిపారు.

schools reopen in telangana
schools reopen in telangana

పిల్లల పేరెంట్స్ బడులు తెరవడం పట్ల సానుకూలంగా స్పందించారని.. ధైర్యంగా పిల్లలను బడికి పంపిస్తామని చెప్పినట్టు ఆమె అన్నారు. డీఈవో, ప్రధానోపాధ్యాయులు గతంలో కంటే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన సమయంలో భౌతిక దూరం పాటించాలని, పిల్లలు గుమిగూడకుండా చూడాలని ఆమె సూచించారు.sch

Minister Sabitha Indra Reddy
Minister Sabitha Indra Reddy

ప్రభుత్వ పాఠశాలల్లో 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని.. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఉపాధ్యాయులు, అధికారులు శ్రమించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. రెసిడెన్షియల్ పాఠశాలలు తప్ప మిగతా పాఠశాలలను ప్రారంభించాలని ఆదేశించినట్టు మంత్రి సబితా రెడ్డి తెలిపారు. లక్షా ఇరవై వేల మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఇంటర్మీడియట్ లో లక్ష ఇరవై ఐదు వేలమంది పిల్లలు ప్రైవేట్ కాలేజీ నుంచి ప్రభుత్వ కాలేజీల్లో చేరారని.. తెలిపారని మంత్రి అన్నారు.