రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్ద పీట: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - TNews Telugu

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్ద పీట: మంత్రి శ్రీనివాస్ గౌడ్Minister Srinivas Goud honors shooting athlete Kumari Isha Singh
Minister Srinivas Goud honors shooting athlete Kumari Isha Singh

ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గత 6, 7 సంవత్సరాల నుండి క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులను, కోచ్ లను ప్రోత్సహించడం తో క్రీడా రంగంలో మంచి పలితాలు వస్తున్నాయన్నారు.

ఇటీవల పెరు దేశంలోని లిమా పట్టణంలో జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్స్ షిప్ లో వ్యక్తి గత విభాగంలో 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ , 50 మీటర్ల ప్రీ పిస్టోల్ విభాగంలో రజత పతకాలను సాధించిన షూటింగ్ క్రీడాకారిణి కుమారి ఇషా సింగ్ ను ఇవాళ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. తెలంగాణ కు చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అద్భుతమైన ప్రతిభను కనబరస్తూ రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారన్నారు. ఇషా సింగ్ షూటింగ్ క్రీడలో దేశంలో, ప్రపంచంలో అగ్రశ్రేణి క్రీడాకారిణి గా రాణిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో షూటింగ్ క్రీడా హబ్ గా మారుతుందన్నారు.

షూటింగ్ రెంజ్ ఏర్పాటు కోసం ఒలింపియన్ గగన్ నారంగ్ కు గచ్చిబౌలి లో అకాడమీ ఏర్పాటుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) స్థలాన్ని కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో రెండు శాతం రిజర్వేషన్లు , 0.5 శాతం ఉన్నత విద్య కోసం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు.

ఈ కార్యక్రమంలో క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ఇషా సింగ్ తండ్రి సచిన్, SATS డిప్యూటీ డైరెక్టర్ సుజాత, షూటింగ్ అసోసియేషన్ సెక్రెటరీ రవికుమార్ తదితరులున్నారు.