సరూర్‌నగర్‌ చెరువులో బోటింగ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

boating-on-Saroor-Nagar-pond

హైదరాబాద్‌ లోని సరూర్ నగర్ చెరువులో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో బోటింగ్ కేంద్రాన్ని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. తర్వాత హయత్ నగర్ లోని హయత్ బక్షి మసీదు పునరుద్ధరణ పనులను ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.

హయత్ బక్షి పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.