మంత్రిగా ఏమీ చెయ్యనివాడు.. ఎమ్మెల్యేగా ఏం సాధిస్తడు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud was serious comments on Etela Rajender

Minister Srinivas Goud was serious comments on Etela Rajender

మంత్రిగా ఉన్న సమయంలో ఏమి చేయ్యని ఈటల.. ఎమ్మెల్యే అయితే మాత్రం ఏంచేస్తాడని ప్రశ్నించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. టీఆర్ఎస్ పార్టీలో ఉండి హుజురాబాద్ లో మరో సెకండ్ లీడర్ ను కూడా ఎదగనీయలేదని తీవ్రంగా విమర్శించారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఇతర పార్టీ నేతలతో కలసి మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి… ఆయనకు టీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ఈటలనుద్ధేశించి ప్రశ్నించారు. ఆయన్ను తెలంగాణ ప్రజానీకానికి పరిచయం చేసిందే కేసీఆర్ అని, ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులకు లేని ఆత్మ గౌరవం నీ ఒక్కడికే ఉందా.. అని ప్రశ్నించారు. ఎప్పుడైతే లెఫ్ట్ భావజాలం అని, రైట్ పార్టీ బీజేపీ లో చేరాడో .. అప్పుడే ఆయన ఆత్మ గౌరవం పోయిందన్నారు.

హుజురాబాద్ ప్రజలు చికెన్ కు అమ్ముడుపోరని, బీసీ కులస్తులు రాజకీయంగా, సామాజికంగా ఎదుగుతున్నారన్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు డబ్బులతో ప్రజలను కొనాలని చూస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పని చేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని, పార్టీలో సీఎం కుర్చీ తప్ప అన్ని పదవులు బీసీలకే వచ్చాయన్నారు. బిజేపీ పార్టీ వాళ్ళు బీసీ కుల గణన జరిపాలంటే ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ఒక్క బీసీ మంత్రి పదవి కూడా కేంద్రాల్లో ఇవ్వలేదని అన్నారు. బీజేపీ పార్టీ అంటేనే బీసీలకు వ్యతిరేకమని, ఉన్న ఉద్యోగాలను ఊడకొడుతున్నారని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వారికి అమ్ముతున్నారన్నారు. హుజురాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని , దేశంలో లేని పథకాలు తీసుకవస్తామని చెప్పారు.