బండి సంజయ్.. చిల్లర ఆరోపణలు మానుకో: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

సబ్బండ వర్గాలు సంతోషంగా ఉండాలని అన్ని వర్గాల‌ ప్రజలని అక్కున చెర్చుకున్న వ్యక్తి కెసిఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనా సమయంలో ప్రజల పక్షాన మేము నిలుచున్నాం. హుజురాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ కి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారని ఆయన అన్నారు.

ఈటెల రాజేందర్ కరోనా సమయంలో, వడ్ల కొనుగోలు విషయంలో ఏం చెప్తాడో చెప్పాలి. బండి సంజయ్ చిల్లర ఆరోపణలు మానుకోవాలి. మేము ప్రధాన మంత్రిని మాటలు అనలేమా. హుజురాబాద్ లో గోడ గడియారాలు, బొట్టు బిల్లలు, కుట్టు మిషన్ లు ఇచ్చిన సంస్కారం ఈటెల రాజేందర్ ది. సత్య హరిచంద్రునిలా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. చట్టాలు, నిబంధనలు తుంగలో తొక్కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న మీటింగ్ పెట్టారు. గిల్లి కజ్జాలు పెట్టుకొని బీజేపీ వారు లొల్లి పెట్టుకొవాలని చూస్తున్నారని మంత్రి తలసాని మండిపడ్డారు.