క్రీడా పాలసీ రూపకల్పనపై మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సమీక్ష

Minister V Srinivas Goud Review

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్.. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో క్రీడా శాఖ, పర్యాటక శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశంలో క్రీడా పాలసీ డ్రాఫ్ట్ పై చర్చించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు  దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ రూపకల్పన పై గత కేబినెట్ సబ్ కమిటీ లోని సభ్యులు చేసిన సూచనలను, సలహాలను పరిగణనలోకి తీసుకుని వాటిని పాలసిలో పొందుపర్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రీడా శాఖ అధికారులను ఆదేశించారు. సలహాలు, సూచనలను చేసి డ్రాఫ్ట్ క్రీడా పాలసీ వచ్చే క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యుల ముందు ప్రవేశ పెట్టేలా రూపకల్పన చేయాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఆలాగే రాష్ట్రంలో జరుగుతున్న క్రీడా అభివృద్ధి పనులు, క్రీడా మైదానాల నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల కల్పన పనులపై రివ్యూ చేశారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని క్రీడా శాఖ అధికారులను ఆదేశించారు. ప్రారంభం కానీ క్రీడా స్టేడియాల పనులను వెంటనే శంకుస్థాపన చేయుటకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

అలాగే, టూరిజం శాఖ అధికారులతో వివిధ దశలలో ఉన్న టూరిజం ప్రాజెక్ట్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నీరా కేఫ్ నిర్మాణ పనులు, మహబూబ్ నగర్ పట్టణంలోని శిల్పారామం, ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులు, హన్మకొండ లోని కాళోజీ కళాక్షేత్రం పనులు, వంగర లోని PV విజ్ఞాన వేదిక పనుల పురోగతి పై ఈ సమీక్షా సమావేశంలో చర్చించి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.